Muthyalamma : ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసంపై పవన్ రియాక్షన్
Muthyalamma : ఇది దుర్మార్గమని, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను ఏ మతం వారైనా సామూహికంగా కాపాడుకోవాలన్నారు
- By Sudheer Published Date - 12:39 PM, Wed - 16 October 24

రెండు రోజుల క్రితం సికింద్రాబాద్ (Secunderabad ) కుమ్మరిగూడ (Kurmaguda ) ముత్యాలమ్మ ఆలయం(Muthyalamma Temple)లోని అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అర్థరాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు అమ్మవారి విగ్రహాన్ని కాలితోతన్నుతూ ధ్వసం చేసారు. స్థానికులు ఓ నిందితుడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై ఆగ్రహించిన హిందూ సంఘాలు పెద్దఎత్తున ఆలయం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. బిజెపి నేతలు కిషన్ రెడ్డి , ఈటెల రాజేందర్ తదితరులు దీనిపై విచారణ వ్యక్తం చేసి , నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని..ఇలాంటి ఘాతాలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులకు కోరారు.
ఈ ఘటన పై జనసేన అధినేత, సినీ నటుడు , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. ముత్యాలమ్మ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం ఆందోళన కలిగించిందని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఇది దుర్మార్గమని, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను ఏ మతం వారైనా సామూహికంగా కాపాడుకోవాలన్నారు. గత ఐదేళ్లలో ఏపీలో ఆలయాలను ఇలా అపవిత్రం చేయడం చూసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి వాటిని నిలువరించేందుకు కఠిన చర్యలు అవసరమని చెప్పారు.
Read Also : Chandrababu Skill Development Case : న్యాయం గెలిచింది! స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్..