HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Passengers Who Were Let Down By The Conductor

Free Bus Scheme : ఫ్రీ బస్సు లో మీరెందుకు అంటూ కండక్టర్నే కిందకు దించేసిన ప్రయాణికులు..

  • Author : Sudheer Date : 28-12-2023 - 1:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Passengers Who Were Let Down By The Conductor
Passengers Who Were Let Down By The Conductor

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఎంతో ప్రతిష్ట్మాకంగా తీసుకొచ్చిన మహిళా ఫ్రీ బస్సు (Free Bus Scheme) సౌకర్యం..ఆర్టీసీ సిబ్బందికి తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ఈ పథకం ద్వారా ఆర్టీసీ కి భారీ లాభాలు వస్తున్నాయని సంబర పడాలో..డ్రైవర్లపై , కండక్టర్ల ఫై దాడులు జరుగుతున్నాయని బాధపడాలో అర్ధం కావడం లేదు.

తాజాగా కొత్తగూడెం (Kothagudem) లో బస్సు డ్రైవర్ నాగరాజు ఫై ఆటో డ్రైవర్లు దాడి చేసిన వార్త వెలుగులో రాగా..మరోచోట ఏకంగా ఫ్రీ బస్సు లో మీరెందుకు అంటూ మహిళా కండక్టర్ ను కిందకు దింపేసి ఘటన ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. గురువారం ఉదయం కొత్తగూడెం డిపో నుంచి ఖమ్మం బయల్దేరిన పల్లెవెలుగు బస్సు పట్టణంలోని పోస్టాఫీస్ కూడలికి చేరుకుంది. అప్పటి వరకు స్థానిక సర్వీసు ఆటోల్లో వెళదామనుకున్న ప్రయాణికులంతా..బస్సు వచ్చేసరికి ఆటో దిగి.. ఒక్కసారిగా బస్సెక్కారు. అదే సమయంలో అక్కడున్న నలుగురు ఆటోడ్రైవర్లు ఆవేశంతో బస్సు డ్రైవర్ నాగరాజుపై దాడిచేశారు. అతనిపై నీళ్లు చల్లుతూ అసభ్య పదజాలంతో దూషించారు. కండక్టర్ సరస్వతి, ప్రయాణికులు వారించే ప్రయత్నం చేసినా వారు ఆగలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక మరో ఘటన విషయానికి వస్తే …ఇది కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. బస్సులో కనీసం నిల్చొని వెళ్లే పరిస్థితి లేకపోవడం తో మహిళలు డోర్ దగ్గర ప్రమాదకర రీతిలో నిల్చుని ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో బస్సు కండక్టర్ లోపలికి రమ్మని పిలవడంతో.. ఆ బస్సులో ఉన్న మహిళలు కండక్టర్ నే దించేశారు. దీంతో ఆ మహిళా కండక్టర్ బూర్గంపాడులో అర్ధాంతరంగా ఆ పల్లెవెలుగు బస్సును నిలిపివేసింది. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా పరిమితికి మించి మహిళలు బస్సు ఎక్కి కనీసం కండక్టర్‌ను కూడా బస్సు ఎక్కనీయకుండా చేస్తున్నారని ఆమె వాపోయింది. డోర్ దగ్గర ఉన్న మహిళలను లోపలికి రావాలని కోరినందుకు బూతులు తిట్టారని, తీవ్ర ఇబ్బందికి గురి చేశారని ఆమె ఎమోషనల్ అయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఫ్రీ బస్.. ఏడుస్తున్న కండక్టర్లు…

తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ ఫ్రీ బస్సు పథకంతో కండక్టర్లు కష్టాలు పడుతున్నారు. తాజాగా భద్రాచలం డిపోకు చెందిన బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కారు. డోర్ దగ్గర ఉన్న వారు లోపలికి రావాలని మహిళా కండక్టర్ చెప్పినా వినలేదు. ప్రభుత్వం తమకు ఫ్రీ… pic.twitter.com/l4CTENAySL

— Telugu Scribe (@TeluguScribe) December 28, 2023

Read Also : PM Modi: విజయకాంత్‌ మరణం పట్ల మోడీ సంతాపం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Conductor
  • Free Bus for Women
  • telangana
  • tsrtc bus rush

Related News

bjp Mp Godam Nagesh

తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

Bjp Mp Godam Nagesh  ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది. జిల్లాలో కొత్తగా ఎయిర్‌పోర్టు కానుంది. ఈ మేరకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్‌ను ఎంపీ గోడం నగేష్ విడుదల చేశారు. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం అవుతాయని ఎంపీ వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఆదిలాబాద్ కొత్త ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్ల

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Half Day Schools

    Half-Day Schools: తెలంగాణ లో ఒంటిపూట బడులు ఎప్పటి నుండి అంటే ..!!

Latest News

  • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

  • మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

  • Encounter in Karregutta : కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

  • Kavitha New Party : కవిత పార్టీ సిద్ధాంతాలు ఇవే !!

  • బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd