Free Bus Scheme : ఫ్రీ బస్సు లో మీరెందుకు అంటూ కండక్టర్నే కిందకు దించేసిన ప్రయాణికులు..
- Author : Sudheer
Date : 28-12-2023 - 1:00 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఎంతో ప్రతిష్ట్మాకంగా తీసుకొచ్చిన మహిళా ఫ్రీ బస్సు (Free Bus Scheme) సౌకర్యం..ఆర్టీసీ సిబ్బందికి తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ఈ పథకం ద్వారా ఆర్టీసీ కి భారీ లాభాలు వస్తున్నాయని సంబర పడాలో..డ్రైవర్లపై , కండక్టర్ల ఫై దాడులు జరుగుతున్నాయని బాధపడాలో అర్ధం కావడం లేదు.
తాజాగా కొత్తగూడెం (Kothagudem) లో బస్సు డ్రైవర్ నాగరాజు ఫై ఆటో డ్రైవర్లు దాడి చేసిన వార్త వెలుగులో రాగా..మరోచోట ఏకంగా ఫ్రీ బస్సు లో మీరెందుకు అంటూ మహిళా కండక్టర్ ను కిందకు దింపేసి ఘటన ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. గురువారం ఉదయం కొత్తగూడెం డిపో నుంచి ఖమ్మం బయల్దేరిన పల్లెవెలుగు బస్సు పట్టణంలోని పోస్టాఫీస్ కూడలికి చేరుకుంది. అప్పటి వరకు స్థానిక సర్వీసు ఆటోల్లో వెళదామనుకున్న ప్రయాణికులంతా..బస్సు వచ్చేసరికి ఆటో దిగి.. ఒక్కసారిగా బస్సెక్కారు. అదే సమయంలో అక్కడున్న నలుగురు ఆటోడ్రైవర్లు ఆవేశంతో బస్సు డ్రైవర్ నాగరాజుపై దాడిచేశారు. అతనిపై నీళ్లు చల్లుతూ అసభ్య పదజాలంతో దూషించారు. కండక్టర్ సరస్వతి, ప్రయాణికులు వారించే ప్రయత్నం చేసినా వారు ఆగలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక మరో ఘటన విషయానికి వస్తే …ఇది కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. బస్సులో కనీసం నిల్చొని వెళ్లే పరిస్థితి లేకపోవడం తో మహిళలు డోర్ దగ్గర ప్రమాదకర రీతిలో నిల్చుని ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో బస్సు కండక్టర్ లోపలికి రమ్మని పిలవడంతో.. ఆ బస్సులో ఉన్న మహిళలు కండక్టర్ నే దించేశారు. దీంతో ఆ మహిళా కండక్టర్ బూర్గంపాడులో అర్ధాంతరంగా ఆ పల్లెవెలుగు బస్సును నిలిపివేసింది. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా పరిమితికి మించి మహిళలు బస్సు ఎక్కి కనీసం కండక్టర్‌ను కూడా బస్సు ఎక్కనీయకుండా చేస్తున్నారని ఆమె వాపోయింది. డోర్ దగ్గర ఉన్న మహిళలను లోపలికి రావాలని కోరినందుకు బూతులు తిట్టారని, తీవ్ర ఇబ్బందికి గురి చేశారని ఆమె ఎమోషనల్ అయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఫ్రీ బస్.. ఏడుస్తున్న కండక్టర్లు…
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ ఫ్రీ బస్సు పథకంతో కండక్టర్లు కష్టాలు పడుతున్నారు. తాజాగా భద్రాచలం డిపోకు చెందిన బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కారు. డోర్ దగ్గర ఉన్న వారు లోపలికి రావాలని మహిళా కండక్టర్ చెప్పినా వినలేదు. ప్రభుత్వం తమకు ఫ్రీ… pic.twitter.com/l4CTENAySL
— Telugu Scribe (@TeluguScribe) December 28, 2023
Read Also : PM Modi: విజయకాంత్ మరణం పట్ల మోడీ సంతాపం