Panchayat Elections in Telangana : మళ్లీ తెలంగాణ లో ఎన్నికల హడావిడి
- By Sudheer Published Date - 10:43 AM, Thu - 7 December 23

తెలంగాణ (Telangana) లో రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికల (Assembly Election 2023) హడావిడి పూర్తికాగా..ఇప్పుడు మరోసారి ఎన్నికల హడావిడి మొదలుకాబోతున్నాయి. ఈసారి పల్లెల్లో ఎన్నికల హడావిడి మొదలుకాబోతుంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి లో పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) జరగబోతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అందులో భాగంగా సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలు పంపించాలని అధికారులను ఎన్నికల కమిషన్ కోరింది. సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలను గ్రామ కార్యదర్శులు ఎలక్షన్ కమిషన్ కు పంపించారు. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణలో మొత్తం 12 వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. లక్షా 13 వేలకు పైగా వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆర్టికల్ 243E(3)(a) ప్రకారం గ్రామ పంచాయతీల పదవీకాలం ఐదేళ్లు కాగా.. ఆ గడువు ముగుస్తుండడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల పక్రియను మొదలుపెట్టారు. ఇక ఈరోజు తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తుండగా..ఉప ముఖ్యమంత్రి గా భట్టి విక్రమార్క , శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Read Also : Khammam: కొత్త కేబినెట్ లో ఖమ్మం నుంచే ముగ్గురు.. అందరి దృష్టి జిల్లా పైనే..!