Palvai Sravanti: ఒక ఆడపిల్లను ఎదుర్కొనలేక బీజేపీ కుట్రలు చేస్తోంది..నేను సీఎంను కలవలేదు..!!
- Author : hashtagu
Date : 03-11-2022 - 9:04 IST
Published By : Hashtagu Telugu Desk
సీఎం కేసీఆర్ తో తాను భేటీ అయినట్లు వస్తున్న వార్తలపై మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వయి స్రవంతి స్పందించారు. ఇదంతా బీజేపీ ప్రచారం చేస్తున్న కుట్ర అంటూ మండిపడ్డారు. తాను కేసీఆర్ కలవలేదని స్పష్టం చేశారు. ఒక ఆడపిల్లను ఎదుర్కొనే శక్తి లేక ఇలాంటి పిచ్చి ప్రచారాలు బీజేపీ చేస్తోదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారుతున్నాని ప్రచారం చేస్తున్న వారిపై ఈసీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
బీజేపీ నేతలు ఎందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ శ్రేణులు, మునుగోడు ప్రజలు బీజేపీ చేస్తున్న కుట్రను నిషితంగా పరిశీలించండి. అమ్ముడుపోయేవారే…ఇలాంటి ప్రచారాలకు తెరతీస్తున్నారు. నేను ఎక్కడికిపోనూ..కాంగ్రెస్ లోనే ఉంటాను. అధికారంలో ఉన్న రెండు పార్టీలు సామాన్యులపై దాడులు చేస్తున్నారు. ఆడపిల్లను ఎదుర్కొలేని వీరు…ప్రజలకు ఏంన్యాయం చేస్తారంటూ ప్రశ్నించారు.