MLA Yashaswini Reddy : అందరి చేత శభాష్ అనిపించుకుంటున్న పాలకుర్తి ఎమ్మెల్యే..
- By Sudheer Published Date - 08:39 PM, Mon - 8 January 24

ఎన్నికల్లో (Elections) ఎంతమంది రాజకీయ నేతలు (Political Leaders) ఎన్నో హామీలు కురిపిస్తుంటారు..వారి హామీలను చూసి జనాలు తెగ సంతోషపడిపోయి..వారిని గెలిపించుకుంటారు..ఇక గెలిచినా తర్వాత హామీలు కాదు కదా..కనీసం ఓటు వేసిన ఓటర్లను కూడా చూడరు..ఏదైనా కావాలన్నా..ఏ పని కోసమైనా ఎమ్మెల్యే దగ్గరికి పోయిన వారు పట్టించుకునే పాపన పోరు..తిరిగి తిరిగి కాళ్ల చెప్పులు అరగాలి కానీ వారి పని మాత్రం అవుతుందనే గ్యారెంటీ లేదు. అలాంటిది తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..గెలిచినా రెండు రోజులకే హామీలను నెరవేర్చేపనిలో పడింది. కేవలం ప్రభుత్వమే కాదు ఎమ్మెల్యేలుగా గెలిచినా వారు సైతం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి (Palakurthy MLA Yashaswini Reddy) ఇచ్చిన హామీలను నెరవేర్చే పని మొదలుపెట్టింది. గూర్తూరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (Skill Development Centre)కు ఈరోజు భూమిపూజ (Lays Foundation Stone) చేసి వార్తల్లో నిలిచింది. ఝాన్సీ, రాజేందర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మిస్తున్నారు. 75 ఎకరాల స్వంత స్థలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను యశస్విని రెడ్డి నిర్మిస్తున్నారు. ఎన్నికల సమయంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మిస్తామని నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. దీని ద్వారా పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ ఇవ్వనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భూమిపూజ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు , ప్రజలు , యువత హాజరయ్యారు. ఎన్నికల్లో మాటలు చెప్పే నేతలను చూసాం..కానీ ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్న నేత మీరే అంటూ అక్కడికి వచ్చిన వారే కాదు నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
Read Also : Lakshadweep : అంత లక్షద్వీప్ వైపే చూస్తున్నారట..ఇదంతా మోడీ మాయే..!!