Pailla Shekar Reddy : ఐటీ దాడుల తర్వాత మొదటిసారి మాట్లాడిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి.. నా ఇమేజ్ డ్యామేజ్ చేశారంటూ..
ఐటీ దాడుల అనంతరం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మొదటిసారి తన నియోజకవర్గం భువనగిరికి వచ్చి కార్యకర్తలతో, అనుచరులతో సమావేశం నిర్వహించారు.
- By News Desk Published Date - 08:30 PM, Sun - 18 June 23

గత వారం భువనగిరి(Bhuvanagiri) ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి(MLA Pailla Shekar Reddy) నివాసంలో, ఆయన ఆఫీసుల్లో ఐటీ(IT) దాడులు జరిగాయి. దాదాపు మూడు రోజుల పాటు ఈ దాడులు నిర్వహించారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి బంధువుల ఇంట్లో కూడా ఈ సోదాలు నిర్వహించారు.
ఐటీ దాడుల అనంతరం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మొదటిసారి తన నియోజకవర్గం భువనగిరికి వచ్చి కార్యకర్తలతో, అనుచరులతో సమావేశం నిర్వహించారు. BRS పార్టీ కార్యకర్తలు పైళ్ల శేఖర్ రెడ్డికి భువనగిరిలో ఘన స్వాగతం పలికారు. పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బుధవారం రోజున ఐటీ అధికారుల నుండి ఫోన్ వచ్చింది. మా ఇంట్లో సోదాలు జరిగాయి. కానీ వాళ్లకు ఎలాంటి అక్రమ ఆస్తులు దొరకలేదు. మా మామ గారి ఇంట్లో సోదాలు అవాస్తవం. సౌత్ ఆఫ్రికా మైనింగ్ కూడా అబద్ధం. మీడియాలో అనేక అవాస్తవాలు ప్రచారం అయ్యాయి. నేను వాటిని ఖండిస్తున్నాను. మూడు రోజులు నా నివాసంపై ఐటీ దాడులు నిర్వహించారు. దస్తావేజులు పరిశీలించారు. ఐటీ అధికారులకు అన్ని రకాలుగా సహకరించాను. బందువుల ఇళ్లలో సోదాలు, కీలక దస్తావేజులు స్వాధీనం అంటూ స్క్రోలింగ్ లు వేయటం కరెక్ట్ కాదు. సౌత్ ఆఫ్రికా లో మైన్స్ ఉన్నాయంటూ ప్రచారం తగదు. ఉద్దేశపూర్వకంగానే దాడులు నిర్వహించారు. అవకాశం కోసం చూశారు. అదును చూసుకొని నా ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారు. ఐటీ దాడులు వ్యాపార సంబంధిత అంశం. రాజకీయ కుట్రను నేను మాట్లాడలేను అని వ్యాఖ్యానించారు.
Also Read : Congress Leader KLR : మంత్రుల ఇలాకాలపై కాంగ్రెస్ సీనియర్ నేత కేఎల్ఆర్ ఫోకస్..