Congress Leader KLR : మంత్రుల ఇలాకాలపై కాంగ్రెస్ సీనియర్ నేత కేఎల్ఆర్ ఫోకస్..
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) ఈ సారి ఓ మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రుల ఇలాకపై
- By Prasad Published Date - 03:22 PM, Sun - 18 June 23

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) ఈ సారి ఓ మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రుల ఇలాకపై ఫోకస్ పెట్టారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లా ప్రాంత వాసులకి అత్యంత సుపరిచితులుగా పేరున్న కేఎల్ఆర్.. హై కమాండ్ ఆదేశాలతో ఎలక్షన్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఏక కాలంలో కేసీఆర్ క్యాబినెట్‌లోని ఇద్దరు మంత్రులు, ఒక మాజీ మంత్రి నియోజకవర్గాలపై గురి పెట్టారు. ఈ మూడింట్లో ఏదొక నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతారని కాంగ్రెస్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వలస వెళ్లిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆమె నియోజకవర్గంలో పనితీరు, లోటు పాట్లపై కేఎల్ఆర్ దృష్టి సారించారు. మంత్రిగా కూడా అధికారం వెలగబెడుతోన్నసబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గానికి చేంసిందేమీ లేదని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అలాగే మరో మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గంపై కూడా కేఎల్ఆర్ ఫోకస్ చేస్తున్నారు. మేడ్చల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆయన రేయింబవళ్లూ సీఎం కేసీఆర్, కేటీఆర్ భజన చేయడం తప్ప తన నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదనే ప్రచారం ఉంది. రానున్న ఎన్నికల్లో కేఎల్ఆర్‌ను మేడ్చల్ నుంచి కూడా కాంగ్రెస్ అధిష్టానం బరిలో దింపవచ్చనే ప్రచారం జరుగుతుంది.
ఇటు తాండూరులో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి లేదా సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని కిచ్చన్నగారి లక్ష్మారెట్టి ఢీకొట్టే అవకాశం ఉంది. మాజీ మంత్రిపై ఉన్న వ్యతిరేఖతతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డిని ప్రజలు గెలిపించారు. అయితే ఆపరేషన్ ఆకార్ష్‌లో భాగంగా రోహిత్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడడంతో పార్టీ క్యాడెర్, ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఒకవేళ కేఎల్ఆర్ ఇక్కడ నుంచి బరిలోకి దిగితే కేసీఆర్ టీమ్‌లోని బలమైన నేతగా ఉన్న మహేందర్ రెడ్డికి కష్టకాలం తప్పదని వినికిడి. మొత్తానికి ఈ మూడు స్థానాల్లో కేఎల్ఆర్ ఎక్కడ నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్‌కు ఒక సీటు కన్ ఫర్మ్ అని తెలుస్తోంది.