HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Owaisi Brothers Feliciated Subhan Khan

REAL HERO Subhan Khan : సుభాన్ ఖాన్ ను సన్మానించిన అసదుద్దీన్ ఒవైసీ

Owaisi Brothers Feliciated Subhan Khan : సుభాన్ ఖాన్‌ను అతని ధైర్యసాహసాలకు గాను ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్ ముస్లిమీన్ (AIMIM) శనివారం అతన్ని సన్మానించింది

  • By Sudheer Published Date - 07:34 PM, Sat - 7 September 24
  • daily-hunt
Aimim Presents Subhan Khan
Aimim Presents Subhan Khan

Owaisi Brothers Feliciated Subhan Khan : సుభాన్ ఖాన్ (Subhan Khan)..ఈ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. పోతే ఒక్కడినే.. బతికితే 9 మంది (If I die, I die alone. Else, I come back with nine) అనే సాహసంతో తొమ్మిది మందిని రక్షించి రియల్ హీరో (REAL HERO) అనిపించుకున్నాడు. ప్రభుత్వం సాయం చేయకపోయినా..ఊరివారు ముందుకు రాకపోయినా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మున్నేరు నదిపై ప్రకాష్ నగర్ వంతెనపై చిక్కుకున్న 9 మందిని కాపాడి ఈరోజు వార్తల్లో నిలిచారు. సుభాన్ ఖాన్ చేసిన ధైర్యానికి ఊరు వాడ, ఖమ్మం నగరమే కాదు యావత్ తెలుగు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సుభాన్ ఖాన్ కు రూ.51 వేల చెక్ అందజేసిన ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ

సుభాన్ ఖాన్‌ను అతని ధైర్యసాహసాలకు గాను ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్ ముస్లిమీన్ (AIMIM) శనివారం అతన్ని సన్మానించింది. ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఇతర ఎమ్మెల్యేలు సుభాన్‌ను దర్రస్ సలామ్ వద్ద కలుసుకుని రూ.51,000 చెక్కును అందజేశారు. అలాగే సుభాన్ ఖాన్ కు సీఎం సహాయ నిధి నుంచి పరిహారం అందించాలని, అలాగే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం కింద 2 బిహెచ్‌కె ఫ్లాట్‌ను అందించాలని ఒవైసీ (Asaduddin Owaisi) సీఎం రేవంత్ రెడ్డి ని, ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కోరారు.

మున్నేరు వాగులో చిక్కుకున్న 09 మందిని రక్షించిన సుభాన్ ఖాన్

గత వారం ఖమ్మం మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రవాహానికి ఖమ్మం లోని పలు నగరాలు నీటమునిగాయి. అయితే ప్రకాశ్ నగర్ వద్ద మున్నేరుపై వంతెన వుంది… అప్పటికే ఆ వంతెనను ఆనుకుని ప్రవాహం సాగుతోంది. ఇలాంటి సమయంలోనే 9 మంది ఈ వంతెనపైకి చేరుకుని ఓవైపు నుండి మరోవైపు వెళ్ళే ప్రయత్నం చేసారు. సరిగ్గా వంతెన మధ్యలోకి చేరుకోగానే మున్నేరు నీటి ప్రవాహం పెరింగింది. దీంతో రెండువైపులా నీరుచేరి వీరు మధ్యలో చిక్కుకున్నారు. ముందకు కానీ వెనక్కు కానీ వెళ్లకుండా ప్రవాహం పెరిగింది. కొన్ని గంటల పాటు వారు అలాగే సాయం కోసం అందరికి ఫోన్లు చేసారు. కానీ ఎవ్వరు ముందుకు రాలేదు. ఆ సమయంలో సుభాన్ ఖాన్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జేసీబీ తో వంతెన పైకి వెళ్లి ఆ తొమ్మిదిని మందిని కాపాడి ఆయా కుటుంబాల పాలిట దేవుడయ్యాడు.

REAL HERO!🌊

9 people were stranded for hours in Munneru flood. Ignoring all advice, Subhan Khan drove his JCB alone & rescued them🚜

His said: “If I die, I die alone. Else, I come back with nine”

Subhan Khan, from Haryana, working in Khammam—Salute to him🫡#KhammamFloods pic.twitter.com/DbiZPvoPTr

— SHAIK RAFI (@skrafi81) September 4, 2024

Read Also : Vishwak Sen : మట్టితో స్వయంగా వినాయకుడిని తయారు చేసిన హీరో.. వీడియో వైరల్..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Akaruddin Owaisi
  • khammam
  • Khammam floods
  • Subhan Khan

Related News

    Latest News

    • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

    • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

    • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

    • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd