HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Notices Issued For Exposing Cm Revanths Bammardi Bagotham Harish Rao

సీఎం రేవంత్ బామ్మర్ది బాగోతం బయటపెట్టినందుకే నోటీసులు – హరీష్ రావు

తన బామ్మర్దికి సంబంధించిన బొగ్గు కుంభకోణాన్ని (Coal Scam) తాను బయటపెట్టినందుకే, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రాత్రికి రాత్రే తనకు నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి చేసే ఇటువంటి 'తాటాకు చప్పుళ్లకు' తాము భయపడబోమని, తాము కేసీఆర్ తయారు చేసిన ఉద్యమ సైనికులమని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

  • Author : Sudheer Date : 20-01-2026 - 11:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao Sit
Harish Rao Sit

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారింది. సిట్ (SIT) విచారణకు హాజరయ్యే ముందు మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. తన బామ్మర్దికి సంబంధించిన బొగ్గు కుంభకోణాన్ని (Coal Scam) తాను బయటపెట్టినందుకే, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రాత్రికి రాత్రే తనకు నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి చేసే ఇటువంటి ‘తాటాకు చప్పుళ్లకు’ తాము భయపడబోమని, తాము కేసీఆర్ తయారు చేసిన ఉద్యమ సైనికులమని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యంగా దండుపాళ్యం ముఠా తరహాలో వాటాలు పంచుకుంటున్న వైనాన్ని ప్రశ్నిస్తున్నందుకే తనపై ఇటువంటి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

Phone Tapping

Phone Tapping

ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు అప్పనంగా ధారాదత్తం చేస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని, దీనిపై అసెంబ్లీలో నిలదీసినందుకే వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు, మహిళలకు మహాలక్ష్మీ పథకం, వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ వంటి హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల దృష్టిని మళ్లించేందుకే మున్సిపల్ ఎన్నికల ముందు ఈ కేసులు, విచారణల సీరియల్ నడుపుతోందని ఎద్దేవా చేశారు. గతంలో సర్పంచ్ ఎన్నికల ముందు కేటీఆర్‌కు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ముందు తనకు నోటీసులు ఇవ్వడం వెనుక ఉన్న రాజకీయాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.

సింగరేణి బొగ్గు స్కాంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తున్నట్లు హరీశ్‌రావు వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య కుమ్మక్కు లేకపోతే వెంటనే ఈ కుంభకోణంపై సీబీఐ (CBI) విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నైనీ బ్లాక్ టెండర్లను రద్దు చేయాలని, సింగరేణి నిధులతో ముఖ్యమంత్రి విలాసాలు చేయడంపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలన్నారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా తనపై ఆరోపణలను కొట్టివేశాయని గుర్తు చేశారు. విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వెళ్తానని, భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూనే.. రేవంత్ రెడ్డి అవినీతి బండారాన్ని ప్రజల పక్షాన నిరంతరం బయటపెడుతూనే ఉంటామని హరీశ్‌రావు సవాల్ విసిరారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CBI SIT
  • cm revanth
  • Coal scam
  • harish rao
  • Phone Tapping Case

Related News

Telangana Government Good N

Disabled People : దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

దివ్యాంగుల సాధికారతలో భాగంగా ఇప్పటికే అమలు చేసిన పథకాల వివరాలను ఛైర్మన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తొలి విడతలో భాగంగా సుమారు 4,500 ఇందిరమ్మ ఇళ్లను దివ్యాంగుల కోటాలో కేటాయించగా,

    Latest News

    • IPL Tickets : IPL టికెట్ల అమ్మకాల్లో దందా..ఒక్క టికెట్ రూ. 19 వేలకు అమ్మకం !

    • YCP Jagan : జగన్ కు గుడ్ న్యూస్ తెలిపిన CBI కోర్ట్

    • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

    • Shreyas Iyer Catch : అయ్యర్ క్యాచ్ పై సచిన్ ప్రశంసలు..అత్యుత్తమ క్యాచ్లలో ఇది ఒకటి !

    • ఉప్పు నీటిలో కాళ్లు ఉంచితే ఏమ‌వుతుంది?

    Trending News

      • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

      • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

      • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

      • సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 106 పరుగులు మాత్రమే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd