NIA Raids : తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా NIA సోదాలు…వందమంది PFIకార్యకర్తల అరెస్టు..!!
రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా NIAఆకస్మిక దాడులు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 13 రాష్ట్రాల్లో వంద చోట్ల ఏకకాలంలో సోదాలు జరుపుతోంది.
- By hashtagu Published Date - 10:18 AM, Thu - 22 September 22

రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా NIAఆకస్మిక దాడులు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 13 రాష్ట్రాల్లో వంద చోట్ల ఏకకాలంలో సోదాలు జరుపుతోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFI ఆఫీసులతోపాటు కార్యకర్తల ఇళ్లలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. ఉగ్రవాద కార్యకలపాలకు నిధులు సమకూర్చడంతోపాటు యువతకు ఉగ్రవాద ట్రైనింగ్ ఇస్తున్నట్లు ఆ సంస్థపై ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థకు చెందిన ఆఫీసులు, ముఖ్యనేతలు, కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తోంది ఎన్ఐఏ. తనిఖీలో కీలక ఆధారాలు సేకరించి…పలువురిని అరెస్టు చేసింది. ప్రస్తుతం AP, TELANGANA,కర్నాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో NIAసోదాలు నిర్వహిస్తోంది. పలు చోట్ల ఎన్ఐఏ తోపాటుగా ED కూడా దాడులు చేస్తోంది. దాదాపు వందమంది కార్యకర్తలను అరెస్టు చేసినట్లుగా సమాచారం.
In major action being taken across 10 states, NIA, ED along with state police have arrested over 100 cadres of PFI: Sources pic.twitter.com/RPXBFxg1m2
— ANI (@ANI) September 22, 2022
కాగా హైదరాబాద్ లో చంద్రాయణ గుట్టలోని పీఎఫ్ఐ కార్యాలయాన్ని సీజ్ చేసింది ఎన్ఐఏ. హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్స్ తోపాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. అటు కరీంనగర్, కర్నూలు, గుంటూరులోనూ సోదాలు జరుగుతున్నాయి. కొన్నాళ్ల క్రితం తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లో తనిఖీలు చేసిన కొందరిని అదుపులోకి తీసుకున్న విషయం సమాచారం. వారు ఇచ్చిన సమాచారంతోనే ఈ దాడులు జరుగుున్నట్లు సమాచారం.
Related News

Motha Mogiddam : మోత ‘మాములుగా’ మోగలే..
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రజలు బయటకు వచ్చి ప్లేట్ మీద గరిటెతో, విజిల్ తో ఇలా ఎన్నో రకాలుగా మోత మోగించారు