Condoms Sales : డిసెంబరు 31న బిర్యానీతో పోటీపడి కండోమ్ సేల్స్
2024 సంవత్సరంలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో(Condoms Sales) రూ.31 కోట్లు విలువైన ఐస్‌క్రీమ్ ఆర్డర్స్ వచ్చాయి.
- Author : Pasha
Date : 01-01-2025 - 12:01 IST
Published By : Hashtagu Telugu Desk
Condoms Sales : 2025 సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాం. అయితే న్యూ ఇయర్ వేడుకల వేళ బిర్యానీతో పోటీపడి మరీ కండోమ్స్ సేల్స్ జరిగాయి. ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరం పరిధిలో ఈ ట్రెండ్‌ను గుర్తించారు. ప్రముఖ గ్రాసరీ డెలివరీ యాప్ ‘స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్’లో డిసెంబరు 31న (మంగళవారం) ఒక్కరోజే కండోమ్ ప్యాకెట్లకు భారీగా ఆర్డర్లు వచ్చాయట. మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు తమ ప్లాట్‌ఫామ్‌లో 4,779 కండోమ్స్ ప్యాకెట్లను జనం బుక్ చేసుకున్నారని ‘స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్’ వెల్లడించింది.
Also Read :Financial Changes 2025 : 2025లో ఆర్థిక విషయాల్లో ఎన్నో మార్పులు.. అవేంటో తెలుసుకోండి
నివేదికలో హైదరాబాద్‌వాసుల గురించి..
- 2024 సంవత్సరంలో ఓవరాల్‌గా తమకు వచ్చిన ఆర్డర్ల వివరాలతో ఓ నివేదికను స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వెల్లడించింది.
- ఆ నివేదిక ప్రకారం.. హైదరాబాద్ నగర వాసులు 2024 సంవత్సరంలో 2 లక్షల కండోమ్ ప్యాకెట్ల కోసం ఆర్డర్స్ ఇచ్చారు.
- కండోమ్స్ తర్వాతి లిస్టులో ఉల్లిపాయలు, అరటి పండ్లు, చిప్స్ ఉన్నాయి.
- 2024 సంవత్సరంలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో(Condoms Sales) రూ.31 కోట్లు విలువైన ఐస్‌క్రీమ్ ఆర్డర్స్ వచ్చాయి.
- గత ఏడాది కాలంలో హైదరాబాదీ మహిళలు బ్యూటీ ప్రోడక్ట్స్ కోసం రూ.15 కోట్లు విలువైన ఆర్డర్స్ ఇచ్చారు.
- 2024లో దేశవ్యాప్తంగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా డెలివరీ అయిన ప్రతి 140 ఆర్డర్‌లలో 1 సెక్స్ వెల్‌నెస్ ప్రోడక్ట్ ఉంది.
- 2024లో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా కండోమ్స్ కోసం దేశంలోనే అత్యధిక ఆర్డర్స్ ఇచ్చిన నగరంలో బెంగళూరు నిలిచింది.
Also Read :Singer Sivasri : బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యకు కాబోయే భార్య ఎవరో తెలుసా ?
డేంజర్ బెల్
అవాంఛిత గర్భం, సురక్షిత శృంగారం కోసం కండోమ్ వాడుతుంటారు. వాస్తవానికి ఇప్పుడు కండోమ్ వినియోగించేవారి సంఖ్య చాలా తగ్గిపోతోందట. చాలా దేశాల్లో ప్రజలు ఆర్థిక మాంద్యం కారణంగా కండోమ్స్ లేకుండానే సెక్స్ చేస్తున్నారట. గర్భనిరోధక మాత్రల అమ్మకాలు కూడా బాగా తగ్గాయట. కండోమ్‌ల అమ్మకాలు, వినియోగం పడిపోతే.. లైంగిక సంబంధిత వ్యాధులు పెరిగిపోతాయని ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.