Singer Sivasri : బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యకు కాబోయే భార్య ఎవరో తెలుసా ?
తేజస్వి సూర్య వృత్తి రీత్యా లాయర్(Singer Sivasri). అత్యంత పిన్న వయసులో ఎంపీగా ఎన్నికవడం ద్వారా తేజస్వి రికార్డును క్రియేట్ చేశారు.
- By Pasha Published Date - 10:37 AM, Wed - 1 January 25

Singer Sivasri : కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య.. త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. తమిళనాడులోని చెన్నైకు చెందిన ప్రముఖ గాయని, భరతనాట్యం కళాకారిణి శివశ్రీ స్కంద ప్రసాద్‌ను తేజస్వి సూర్య పెళ్లి చేసుకోబోతున్నారు. మార్చి 24న వీరి పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో వారిద్దరి గురించి మనం ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Visakha Cruise Terminal : 2025 మార్చి నుంచి విశాఖ క్రూజ్ టెర్మినల్ యాక్టివిటీ.. విశేషాలివీ
శివశ్రీ స్కంద ప్రసాద్ గురించి..
- శివశ్రీ మద్రాస్ యూనివర్సిటీలో భరతనాట్యంలో ఎంఏ చేశారు. మద్రాస్ సంస్కృత కళాశాలలో సంస్కృతంలో ఎంఏ చేశారు.
- శివశ్రీ శాస్త్ర యూనివర్సిటీ నుంచి బయో ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు.
- పొన్నియిన్ సెల్వన్ సినిమాలోని పార్ట్ -2లో కన్నడ వర్షన్‌లోని ఒక పాటను శివశ్రీ పాడారు.
- ఆమె యూట్యూబ్ ఛానల్‌కు 2 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
- ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోడీ నుంచి శివశ్రీ మన్ననలు అందుకున్నారు. 2014 సంవత్సరంలో శివశ్రీ ఆలపించిన ఒక పాట అద్భుతంగా ఉందని మోడీ ప్రశంసించారు. ‘పూజిసాలెండె హూగల థాండే’ అనే పాటను కన్నడ భాషలో ఆమె పాడారు. దాన్నే మోడీ మెచ్చుకున్నారు. ఆ పాటలో శ్రీరాముడి గురించి అద్భుతంగా వర్ణించారని ప్రధాని తెలిపారు.
తేజస్వి సూర్య గురించి..
- తేజస్వి సూర్య వృత్తి రీత్యా లాయర్(Singer Sivasri).
- అత్యంత పిన్న వయసులో ఎంపీగా ఎన్నికవడం ద్వారా తేజస్వి రికార్డును క్రియేట్ చేశారు.
- ఆయన ఇప్పటివరకు రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
- ప్రస్తుతం బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి ఎంపీగా తేజస్వి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
- 2020 నుంచి భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా తేజస్వి వ్యవహరిస్తున్నారు.
- గతంలో పలుమార్లు ప్రధాని మోడీ నుంచి తేజస్వి సూర్య కూడా మన్ననలు అందుకున్నారు.
- తనకు రాజకీయాల్లో ప్రధాని మోడీయే రోల్ మాడల్ అని స్వయంగా తేజస్వి చాలా సార్లు చెప్పారు.