Assembly Session: రాష్ట్ర వ్యాప్తంగా 284 కోట్ల మొక్కలు నాటాం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హరితహారం కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
- Author : Balu J
Date : 05-08-2023 - 5:19 IST
Published By : Hashtagu Telugu Desk
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హరితవనాల పెంపుపై శాసనసభలో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, కోరుకంటి చందర్, శానంపూడి సైదిరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం విజయవంతంగా కొనసాగుతుందని, ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని అన్నారు. 2015 నుంచి 2021 వరకు తెలంగాణ రాష్ట్రంలో 7.7% పచ్చదనం పెరిగినట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించిందని అన్నారు. 1,721 చదరపు కిలోమీటర్ల (4,25,259 ఎకరాలు) పచ్చదనంలో సంచిత (క్యూములేటివ్) పెరుగుదల ఉంది. హరితహార కార్యక్రమం ద్వారా 284 కోట్ల మొక్కలను నాటామని, 13.44 లక్షల ఎకరాలలో అంతరించిపోయిన అడవులను పునర్జీవింప చేశామని వివరించారు. పచ్చదనం పెంపులో భాగంగా హరిత బడ్జెట్, హరిత నిధి లాంటి అనేక వినూత్నమైన పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామన్నారు.
సాధించిన ప్రగతి
•ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా నాటిన మొక్కలు: 283.82 కోట్లు
•హరితహారం నిర్వహణ కోసం ఇప్పటిదాకా అయిన వ్యయం: రూ. 11,095 కోట్లు
•బ్లాక్ ప్లాంటేషన్ పూర్తి: 2.03 లక్షలు
•క్షీణించిన అటవీ ప్రాంతాల పునరుద్ధరణ: 13.44 లక్షలు
•అటవీ ప్రాంతాల చుట్టు కందకాల తవ్వకం: 10,980 కిలోమీటర్లు
•రహదారి వనాలు (అవెన్యూ ప్లాంటేషన్): 8,206 కిలోమీటర్లు
•పట్టణ ప్రాంత అటవీ ఉద్యానవనాలు (అర్బన్ ఫారెస్ట్ పార్కులు): 109
•ప్రజలకు అందుబాటులోకి వచ్చిన అర్బన్ ఫారెస్ట్ పార్కులు: 73
హరితవనాలు:
•మొత్తం హరితవనాలు: 164
•హరితవనాల ద్వారా సాధించిన పురోగతి: 1.71 లక్షల ఎకరాలు
•హరితవనాల్లో నాటిన మొత్తం మొక్కలు (2023 వరకు ): 1.16 కోట్లు
నర్సరీలు:
•రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నర్సరీలు (2023): 14,864
•నర్సరీల్లో పెంచిన మొక్కలు (2023): 30. 29 కోట్లు
•ప్రస్తుత సీజన్ (2023) లో నాటిన మొక్కలు నాటే లక్ష్యం: 19.29 కోట్లు
•ఇప్పటిదాకా నాటిన మొక్కలు: 9. 02 కోట్లు
•రానున్న సీజన్ (2024) లో మొక్కలు నాటే లక్ష్యం: 20. 02 కోట్లు