CM Revanth Reddy: సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. నారా లోకేశ్ ట్వీట్
ఎనుముల రేవంత్ రెడ్డి అను నేను శాసనం ద్వారా నిర్మితమైన, భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు
- Author : Praveen Aluthuru
Date : 07-12-2023 - 3:13 IST
Published By : Hashtagu Telugu Desk
CM Revanth Reddy: తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఎనుముల రేవంత్ రెడ్డి అను నేను శాసనం ద్వారా నిర్మితమైన, భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ చేత గవర్నర్ తమిళిసై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఆరు గ్యారంటీల అమలుపై తొలి సంతకం చేశారు. అనంతరం దివ్యాంగురాలు రజినీ ఉద్యోగ నియామక ఉత్తర్వుపై రెండో సంతకం చేశారు. ఆ నియామకపత్రాన్ని ఆమెకు అందించారు. ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ముఖ్మమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు మీ పాలనా పదవీ కాలం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
Congratulations and best wishes to @revanth_anumula Garu on taking the oath as Telangana's Chief Minister. Wishing him a successful tenure. pic.twitter.com/shbs2umhTg
— Lokesh Nara (@naralokesh) December 7, 2023
Also Read: Zodiac Sign: 2024లో ఆ మూడు రాశుల వారికి తిరుగు ఉండదు.. రాజయోగం?