Nara Brahmani : బ్రాహ్మణికి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు..? చంద్రబాబు క్లారిటీ
'మీ ఆలోచనా విధానాలు చాలా ఫాస్ట్ గా ఉన్నాయి. మీ అంత ఫాస్ట్ గా మేం ఆలోచించడం లేదు. అక్కడైనా, ఇక్కడైనా తెలుగు జాతి బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను' అని స్పష్టం చేశారు
- By Sudheer Published Date - 09:17 PM, Sat - 10 August 24

హైదరాబాద్ () లోని ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu)..మీడియా అడిగిన అనేక ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా ‘తెలంగాణ టీడీపీ బాధ్యతలు నారా లోకేశ్ (Nara Lokesh) కు అప్పగించే అవకాశం ఉందా..? నారా బ్రాహ్మణి (Nara Brahmani)ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారా..? అనే ప్రచారానికి చంద్రబాబు తెరదించారు. గత కొద్దీ రోజులుగా మీడియా లో ప్రచారం అవుతున్న ఈ ప్రశ్నలను బాబు వద్ద మీడియా ప్రస్తావించగా.. ‘మీ ఆలోచనా విధానాలు చాలా ఫాస్ట్ గా ఉన్నాయి. మీ అంత ఫాస్ట్ గా మేం ఆలోచించడం లేదు. అక్కడైనా, ఇక్కడైనా తెలుగు జాతి బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను’ అని స్పష్టం చేశారు.
ఏపీలో ఎలాగైతే అధికారం దక్కించుకున్నారో..ఇప్పుడు తెలంగాణ లో కూడా టీడీపీ కి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు బాబు సన్నాహాలు చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ తెరమీదకు రావడం..ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అవ్వడం..పదేళ్ల పాటు కేసీఆర్ పాలనా కొనసాగడం తో టీడీపీ అనేది రాష్ట్రంలో లేకుండా పోయింది. ఇదే సమయంలో ఏపీలో ను టీడీపీ ఓటమి చెందేసరికి అందరు టీడీపీ ని మరచిపోయారు. కానీ ఇప్పుడు ఏపీలో మళ్లీ బాబు సీఎం కావడం…తెలంగాణ బిఆర్ఎస్ ఓటమి చెందడం తో బాబు మళ్లీ తెలంగాణ ఫై ఫోకస్ చేసారు. వరుసగా తెలంగాణ టీడీపీ నేతలతో టచ్ లోకి వస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈరోజు ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన ఆయన టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణకు ఎక్కువ సమయం కేటాయిస్తానని .. ప్రతి రెండో శనివారం తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తానని, . పార్టీని బలపర్చడంపై ఆలోచనలు చేస్తున్నామని.. త్వరలోనే కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని చెప్పుకొచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనోభావాలే తమకు ముఖ్యమని అన్నారు. రేవంత్ రెడ్డి మార్క్ బాగుందని ప్రశంసించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. విజన్ 2020 అంటే తనను 420 అని విమర్శించారని చంద్రబాబు అన్నారు.
తెలుగు ప్రజలు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నానని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం తాను మాట్లాడితే విమర్శించే వారు ఉన్నారని.. అయిన కచ్చితంగా అడుగుతానని అది తన బాధ్యత అని పేర్కొన్నారు. త్వరలో గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెడతానని అన్నారు. 15 రోజుల్లో తెలంగాణలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. యువకులు, బీసీలకు పెద్దపీట వేస్తామని అన్నారు.
Read Also : NTR-Allu Arjun : ఒకే వేదిక మీద ఎన్టీఆర్, అల్లు అర్జున్..?