NTR-Allu Arjun : ఒకే వేదిక మీద ఎన్టీఆర్, అల్లు అర్జున్..?
ఈవెంట్ కు గెస్టులుగా అల్లు అర్జున్, ఎన్టీఆర్ (NTR) వస్తారని టాక్. బామ్మర్ది కోసం ఎన్టీఆర్ ఇంకా బన్నీ వాసు కోసం అల్లు అర్జున్ ఇలా ఈ ఇద్దరు కూడా సినిమాకు సపోర్ట్ చేయనున్నారని తెలుస్తుంది.
- By Ramesh Published Date - 07:39 PM, Sat - 10 August 24

NTR-Allu Arjun యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు కలిసి ఒకే స్టేజ్ మీద కనిపించనున్నారు. ఇద్దరు ఒక సినిమా ఈవెంట్ కు రాబోతున్నారని తెలుస్తుంది. ఇంతకీ ఇద్దరు హీరోలు ఆ వేడుకకు రావడానికి రీజన్ ఏంటి. అసలు ఎవరి సినిమా వేడికకు వీళ్లిద్దరు వస్తున్నారు అన్నది చూస్తే.. ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ లీడ్ రోల్ లో అంజి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఆయ్. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ అవుతుంది.
ఈ సినిమాను గీతా ఆర్త్స్ 2 (Geetha Arts 2) బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో జరగబోతుంది. ఈ ఈవెంట్ కు గెస్టులుగా అల్లు అర్జున్, ఎన్టీఆర్ (NTR) వస్తారని టాక్. బామ్మర్ది కోసం ఎన్టీఆర్ ఇంకా బన్నీ వాసు కోసం అల్లు అర్జున్ ఇలా ఈ ఇద్దరు కూడా సినిమాకు సపోర్ట్ చేయనున్నారని తెలుస్తుంది.
Also Read : Mega Vs Allu: మెగా vs అల్లు: ఈ వివాదం ఎలా శాంతిస్తుందా?
ఈమధ్య మెగా ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ (Allu Arjun) మీద కక్ష కట్టిన ఈ టైం లో.. ఎన్టీఆర్ మీద టీడీపీ ఫ్యాన్స్ అంతా రివర్స్ అవుతున్న ఇలాంటి టైం లో అటు మెగా, ఇటు నందమూరి ఫ్యాన్స్ నుంచి వీళ్ల కలయిక ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
ఐతే సినిమా వేరు రాజకీయాలు వేరు. ఒక సినిమా వేడుక మీద అల్లు అర్జున్ కానీ, తారక్ కానీ పాలిటిక్స్ మాట్లాడే ఛాన్స్ లేదు. ఐతే అల్లు అర్జున్ ఏం మాట్లాడతాడు అన్న దాని మీద మాత్రం చాలా హైప్ ఉంది. ఒకవేళ అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఆయ్ వేడుకకు వస్తే సినిమా గురించి కన్నా వీరు మాట్లాడిన విషయాల గురించి మాత్రం సోషల్ మీడియాలో రచ్చ జరిగే ఛాన్స్ ఉంటుంది.