TCongress: టీకాంగ్రెస్ లో మరో వార్.. కోమటిరెడ్డి వర్సెస్ చెరుకు!
తాజాగా ఆయన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి హాట్ టాపిక్ గా మారారు.
- By Balu J Updated On - 09:55 AM, Mon - 6 March 23

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఆయన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి వివాదాల్లోకెక్కారు. తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ పై ఆయన ఫోన్లో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై సుధాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. చెరుకు సుధాకర్ తనయుడు చెరుకు సుహాస్ తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ సంభాషణ ఆడియో బయటపడింది. ఈ ఆడియోలో వెంకట్ రెడ్డి సుధాకర్ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.
నేరుగా సుధాకర్ కి ఫోన్ చేసి తిట్టినా అంతగా ఫీల్ అయ్యేవారు కాదేమో, ఆయన కొడుక్కి కాల్ చేసి బండబూతులు తిట్టడంతో బాగా ఫీలయ్యారు. వెంకట్ రెడ్డికి మతి ఉందా పోయిందా అంటూ మండిపడ్డారు సుధాకర్. తాను కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా, వెంకట్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ గా ఉండి.. ఒకే పార్టీకోసం కలసి పని చేస్తున్నా కూడా తనపై ఆయన అలాంటి భాష ఉపయోగించడమేంటి అని బాధపడుతున్నారు సుధాకర్. తాను వ్యక్తిగతంగా ఎవరినీ కామెంట్ చేయలేదని, కానీ తనజోలికొస్తే ఊరుకోబోనని అంటున్నారు సుధాకర్. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసభ్య పదజాలంతో తనను తిట్టిన ఆడియో టేపును తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డికి పంపించానని చెప్పారు.

Related News

Hail Rains: తెలంగాణలో నేడు,రేపు వడగళ్ల వర్షాలు
తెలంగాణలో గత కొన్ని రోజులుగా వాతావరణం మారిపోయింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు (Rains) కురుస్తూ వాతావరణాన్ని చల్లబరిచాయి. ద్రోణి ప్రభావం కొనసాగుతుండడమే ఇందుకు కారణం.