My Medaram : అందుబాటులోకి ‘మై మేడారం’ యాప్
- By Kavya Krishna Published Date - 10:15 AM, Mon - 19 February 24

తెలంగాణ కుంభమేళా (Telangana Kumbhamela) మేడారం సమ్మక్క, సారలమ్మ (Sammakka-Saralamma) జాతరకు వచ్చే భక్తుల కోసం ‘మై మేడారం’ (My Medaram) యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. నీరు, వైద్యం, పార్కింగ్, టాయిలెట్స్, స్నానాల ఘాట్లు, మిస్సింగ్ అలర్ట్స్, రిపోర్ట్ మిస్సింగ్, ఫైర్ ఇంజిన్ సేవలు దీనిలో ఉంటాయి. నెట్ వర్క్ లేకపోయినా ఈ యాప్ సహాయంతో సేవలు పొందవచ్చు. అటు నిన్న సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
We’re now on WhatsApp. Click to Join.
మేడారం జాతరలో ప్రధాన ఘట్టాలు బుధవారం ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఆదివారం నుంచే మేడారంకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా, అధికారులు జంపన్న వాగు వద్ద అన్ని కుళాయిల నుండి నీటి సరఫరాను ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తులు ‘బంగారం’గా భావించే బెల్లం (సాధారణంగా వారి బరువుకు సరిపోయే) సమర్పించడానికి ముందు పవిత్ర స్నానం చేస్తారు.
ఇదిలా ఉండగా మేడారంలో కోడిగుడ్లు, కొబ్బరికాయలు, బెల్లం, వాటర్ బాటిళ్లు, కూల్ డ్రింక్స్ సహా పలు నిత్యావసర సరుకులు, నిత్యావసర వస్తువుల ధరలపై ఎలాంటి పర్యవేక్షణ లేదని పలువురు భక్తులు ఆరోపించారు. అధిక ధరలకు విక్రయిస్తున్నారని వాపోయారు. చికెన్ కిలో రూ.280 ఉండగా, రిటైల్ షాపుల్లో కిలో రూ.160 మాత్రమే ఉండటం గమనార్హం. కొబ్బరికాయలు 20 రూపాయల నుండి 50 రూపాయలు, ఒక లీటర్ వాటర్ బాటిల్ ధర అన్ని చోట్ల కేవలం 20 రూపాయలు ఉండగా.. మేడారం జాతరలో రూ.50 రూపాయలకు అమ్ముతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.
బెల్లం ధర ఆకాశాన్ని తాకుతోంది. మామూలుగా రకాన్ని బట్టి కిలో రూ.40 నుంచి 80 వరకు విక్రయిస్తుండగా.. మేడారంలో వ్యాపారులు కిలో రూ.120 నుంచి 150 వరకు వసూలు చేస్తున్నారు. చాలా దుకాణాల్లో కల్తీ లేదా గడువు దాటిన వస్తువులను విక్రయిస్తున్నారని కొందరు భక్తులు విచారం వ్యక్తం చేశారు. కాగా, నిన్న మహబూబాబాద్ జిల్లా గంగారం గ్రామం పెనుగొండ్ల వద్ద ఉన్న పగిడిద్దరాజు ఆలయాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి డి.అనసూయ సీతక్క సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. ఫిబ్రవరి 21 నుంచి రద్దీని దృష్టిలో ఉంచుకుని మేడారం వద్ద ఆలయం, జంపన్న వాగు వద్ద క్యూ లైన్లు, తాత్కాలిక బస్టాండ్‌ల సంఖ్యను కూడా పెంచినట్లు ఆమె తెలిపారు.
Read Also : wedding ceremony : తక్కువ ఖర్చుతో అంగరంగ వైభవంగా పెళ్లి..!