Murder : హైదరాబాద్ ఎంఐఎం కార్పొరేటర్ కార్యాలయంలో యువకుడు హత్య
ఎంఐఎం లలితా బాగ్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం వద్ద యువకుడిని హత్య చేశారు. పట్టపగలు గుర్తుతెలియని దుండగులు
- By Prasad Published Date - 07:40 AM, Tue - 20 December 22

ఎంఐఎం లలితా బాగ్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం వద్ద యువకుడిని హత్య చేశారు. పట్టపగలు గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి చేయడంతో ఇంటర్మీడియట్ విద్యార్థి మృతి చెందాడు. మృతుడిని డివిజన్ 36 కార్పొరేటర్ మహమ్మద్ అలీ షరీఫ్ (ఆజం) మేనల్లుడు సయ్యద్ ముర్తుజా అనస్ (19)గా గుర్తించారు. యువకుడు కార్పొరేటర్ కార్యాలయంలో ఉండగా.. ఇద్దరు దుండగులు బ్లేడుతో అక్కడికి చేరుకుని అతనిపై దాడి చేశారు. ముర్తుజా మెడపై తీవ్రమైన గాయాలు కావడంతో రక్తస్రావం జరిగింది. బాధితుడిని కంచన్‌బాగ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య, భవానీ నగర్ పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. క్లూస్ టీమ్‌ను కూడా రంగంలోకి దిగింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై హత్య కేసు నమోదు చేశారు. హత్యకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసువర్గాలు తెలిపాయి.