MP Aravind : కేటీఆర్ కొవ్వు తగ్గాలంటే జైల్లో వేయాల్సిందే – ఎంపీ అరవింద్
MP Aravind : బీఆర్ఎస్ పార్టీని ప్రజలు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడించిన కేటీఆర్(KTR)కు కొవ్వు తగ్గలేదని, కేటీఆర్ కొవ్వు తగ్గాలంటే జైల్లో వేయాల్సిందే అని తేల్చి చెప్పారు
- By Sudheer Published Date - 03:43 PM, Thu - 14 November 24

లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటన లో కేటీఆర్ పాత్ర ఉందనే వార్తలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కుమార్ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడించిన కేటీఆర్(KTR)కు కొవ్వు తగ్గలేదని, కేటీఆర్ కొవ్వు తగ్గాలంటే జైల్లో వేయాల్సిందే అని తేల్చి చెప్పారు. లగచర్లలో కలెక్టర్ పై కుట్రలో కేటీఆర్ హస్తం ఉందని, ఈసంపల్లిలో నాపై జరిగిన దాడిపై కూడా కేటీఆర్ ప్రమేయం ఉందని, దీనిపై పార్లమెంటు ప్రివిలైజేషన్ కమిటీకి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 38సీట్లో గెలిచిన బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాల్సిన అవసరముందన్నారు.
కేటీఆర్ ఢిల్లీకి వెళితే తెలంగాణ ప్రకంపనలంటూ ట్వీట్ చేసిన తీరు ఆయనలోని అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వాలు, పార్టీలను ప్రజలు ఐదేళ్లకు ఎన్నుకుంటారని, పని చేయకపోతే ప్రజలే దించేస్తారని, దాడులు ఎందుకని ప్రశ్నించారు. లగచర్ల, ఈసంపల్లి ఘటనలో ఎంక్వయిరీ పక్కాగా చేసి కేటీఆర్ ను జైల్లో వేయాలన్నారు. చెల్లి కవితను వేసినట్లుగానే కేటీఆర్ ను జెలులో వేసి, కొవ్వు కరిగించాలని అర్వింద్ చెప్పుకొచ్చారు.
ఇక లగచర్ల దాడిలో కుట్రకోణం ఉన్నట్లు హైదరాబాద్ మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. ఈ దాడి వ్యవహారం వెనుక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాత్ర ఉంది. ఆధారాలతో నిందితుడిగా ఆయనను చేర్చినట్లు పేర్కొన్నారు. ఇక, నరేందర్‌రెడ్డిని మరింత విచారించేందుకు పోలీసు కస్టడీలో తీసుకోవాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు. విచారణలో భాగంగా, దాడిలో పాల్గొన్న 42 మందిని గుర్తించామని, అందులో 19 మంది అసలు భూమి లేదని వెల్లడించారు.
Read Also : Nara Lokesh : శానసమండలిలో బొత్సపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం