Cosmetic Charges : విద్యార్థుల ఖాతాల్లోకి డబ్బులు..సీఎం రేవంత్ కీలక నిర్ణయం
Cosmetic Charges : విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయడం ద్వారా, వారు తాము కోరిన కాస్మెటిక్ వస్తువులను స్వేచ్ఛగా కొనుగోలు చేసుకునే అవకాశం లభిస్తుంది
- By Sudheer Published Date - 05:03 PM, Tue - 13 May 25

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (TG Govt) విద్యార్థుల సంక్షేమానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ సామాజిక, గిరిజన, మైనారిటీ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలను (Cosmetic Charges) నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయాలని (To be deposited into accounts) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం సచివాలయంలో సీఎస్ కె. రామాకృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన సేవలు అందించడంపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు.
Modi’s Biggest Warning : భారత్ వైపు కన్నెత్తి చూస్తే వినాశనమే..పాక్ కు మోడీ వార్నింగ్
విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయడం ద్వారా, వారు తాము కోరిన కాస్మెటిక్ వస్తువులను స్వేచ్ఛగా కొనుగోలు చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే డెబిట్ కార్డు తరహాలో ఒక ప్రత్యేక స్మార్ట్ కార్డు ఇవ్వడం ద్వారా బ్యాంకింగ్ సేవలపై విద్యార్థులకు అవగాహన పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అందించే ఈ సహాయాన్ని మహిళా సంఘాలు నిర్వహిస్తున్న మొబైల్ విక్రయ కేంద్రాల ద్వారా సరఫరా చేసే విధంగా సమన్వయం చేయాలని నిర్ణయించారు. ఈ విధానం వల్ల నిధుల దుర్వినియోగం నివారించబడుతుందని తెలిపారు.
Amazon Prime : ప్రైమ్ వీడియో యూజర్లకు షాకింగ్ న్యూస్!
రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి, వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు అవసరమైన టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫాంలు, బెడ్ షీట్లు, స్కూల్ బ్యాగ్స్ వంటి సామగ్రిని నాణ్యతతో సిద్ధం చేయాలని సూచించారు. దీనికోసం తగిన ప్రతిపాదనలను తక్షణమే రూపొందించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తీసుకున్న ఈ నిర్ణయాలు విద్యార్థుల మౌలిక అవసరాలు తీర్చడమే కాకుండా, వారి ఆత్మస్థైర్యాన్ని పెంచే దిశగా ముందడుగుగా పేర్కొనవచ్చు.