HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Modi Sabha In Hyderabad Traffic Restrictions In The City

PM Modi: హైదరాబాద్ లో మోడీ సభ, నేడు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు.

  • Author : Balu J Date : 11-11-2023 - 12:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi Mantram
Modi Mantram

PM Modi: సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం వరకు హైదరాబాద్‌కు చేరుకుంటారు.ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు చోట్ల ట్రాఫిక్‌ మళ్లింపుతో పాటు.. ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ జి.సుధీర్‌ బాబు వెల్లడించారు. ఈ మేరకు వాహనదారులు ముందుగానే ఈ విషయాలు తెలుసుకుని ఇబ్బందుల పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెప్పారు.

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా.. పంజాగుట్ట-గ్రీన్‌ల్యాండ్, బేగంపేట నుంచి సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ వరకు, టివోలి ఎక్స్‌ రోడ్స్, ప్లాజా ఎక్స్‌ రోడ్ల మధ్య రహదారులు మూసివేయబడతాయని ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు.

అలాగే సికింద్రాబాద్‌ సంగీత్‌ కూడలి నుంచి బేగంపేట వైపు వచ్చే వాహనాలను వైఎంసీఏ వద్ద క్లాక్‌ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్, సీటీఓ, రసూల్‌పురా, బేగంపేట వైపు మళ్లిస్తారని పేర్కొన్నారు.

బేగంపేట నుంచి సంగీత్‌ కూడలి వైపు వచ్చే వాహనాలను సీటీవో ఎక్స్‌ రోడ్స్‌ వద్ద మళ్లిస్తారని చెప్పారు. వాటిని బాలంరాయ్, బ్రూక్‌బాండ్, టివోలి, స్వీకార్‌ ఉప్‌కార్, వైఎంసీఏ, సెయింట్‌ జాన్స్‌ రోటరీ, సంగీత్‌ ఎక్స్‌ రోడ్ల వైపు పంపించనున్నట్లు ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు చెప్పారు.

బోయినపల్లి, తాడ్‌బండ్‌ నుంచి టివోలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను బ్రూక్‌ బాండ్‌ వద్ద సీటీఓ, రాణిగంజ్, ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.

కార్ఖానా, ఏబీఎస్‌ నుంచి ఎస్‌బీహెచ్‌-ప్యాట్ని వైపు వచ్చే వాహనాలు స్వీకార్‌-ఉప్‌కార్‌ వద్ద వైఎంసీఏ, క్లాక్‌ టవర్, ప్యాట్నీ లేదా టివోలి-బ్రూక్‌బాండ్, బాలంరాయ్, సీటీవో వైపు మళ్లాలి అంటూ పోలీసులు సూచనలు చేశారు.

ప్యాట్నీ నుంచి వచ్చే వాహనాలకు ఎస్‌బీహెచ్‌- స్వీకార్‌-ఉప్‌కార్‌ వైపు అనుమతిలేదని పోలీసులు సూచించారు. క్లాక్‌ టవర్, వైఎంసీఏ లేదా ప్యారడైజ్, సీటీఓ వైపు పంపిస్తామని వెల్లడించారు.

జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి బేగంపేటవైపు వచ్చే వాహనాలను పంజాగుట్ట వద్ద ఖైరతాబాద్, గ్రీన్‌ల్యాండ్‌ రాజ్‌భవన్‌ వైపు పంపించనున్నట్లు హైదరాబాద్‌ నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Also Read: Samantha: సమంత స్టన్నింగ్ లుక్స్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Hyderabad Traffic Rules
  • pm modi
  • Restrictions

Related News

Donald Trump

మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ట్రంప్‌!

ఏప్రిల్ 22, 2025న పాకిస్థాన్ ఉగ్రవాదులు పహల్గామ్‌లో పర్యాటకులపై దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • Rowdy Sheeter Rapes A Minor

    మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

  • Indiramma Housing Scheme 2n

    హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

  • Vijayendra Prasad

    మా పూర్వీకులు భయంకరమైన తప్పు చేశారు.. క్షమించండి: విజయేంద్రప్రసాద్‌

  • Hyd Parking

    Parking : హైదరాబాద్ పార్కింగ్ కష్టాలకు పుల్ స్టాప్..ఏంచేయబోతున్నారంటే !!

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd