Samantha: సమంత స్టన్నింగ్ లుక్స్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే
టాలీవుడ్ నటి సమంత రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉంటూ ఎంటర్ టైన్ చేస్తోంది.
- By Balu J Published Date - 12:29 PM, Sat - 11 November 23

Samantha: టాలీవుడ్ నటి సమంత రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉంటూ ఎంటర్ టైన్ చేస్తోంది. క్రమం తప్పకుండా తన అభిమానులను ఆకర్షిస్తుంది. ఇటీవలి ఓ ఫోటోషూట్స్ లో బోల్డ్ గా ఫోజులిచ్చి అభిమానులను ఫిదా చేసింది. ఆమె తన అందమైన శారీరాన్ని మలుచుకున్న తీరును ఫొటోల్లో చూడొచ్చు. తాజాగా ఆమె మెరిసే బ్రాలో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రాలు ఆమె అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.
ఇక సమంత గత కొన్ని నెలలుగా మయోసైటీస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ప్రస్తుతం క్రయోథెరపీ అనే చికిత్స తీసుకుంటుందట. అందులో భాగంగా ఆమె ప్రస్తుతం భూటాన్‌లో ఉన్నారట. అక్కడి చికిత్సలో భాగంగా సమంత హాట్ స్టోన్ బాత్ అనే ఒక చికిత్సను తీసుకుంటున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఆమె సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. అది అలా ఉంటే సమంత త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఏకంగా కండల వీరు సల్మాన్ ఖాన్ సరసన నటించనుందని టాక్ నడుస్తోంది. కరణ్ జోహార్ నిర్మాతగా ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ పై విష్ణువర్ధన్ తెరకెక్కించనున్న సినిమాలో సమంత హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది.
Also Read: Hyderabad: ఖైదీలకు షాకిచ్చిన అధికారులు, 2,500 మందికి నో ఓటింగ్
Related News

Pushpa 2 : పుష్ప2 మరో రికార్డు.. ఓటీటీ రైట్స్ కోసం ఎగబడ్డ ఓటీటీలు.. డీల్ ఎంతో తెలుసా?
పుష్ప మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.