Modi Road Show : మోడీ రాకతో కాషాయంగా మారిన హైదరాబాద్ రోడ్స్
ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి నారాయణ గూడ, వైఎంసీఏ మీదుగా కాచిగూడ వరకు మోడీ రోడ్ షో సాగింది
- Author : Sudheer
Date : 27-11-2023 - 7:26 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ఎన్నికల ప్రచారం (TS Polls)లో భాగంగా హైదరాబాద్ (Hyderabad) కు వచ్చిన ప్రధాని మోడీ (PM Modi)కి బిజెపి నేతలు ఘన స్వాగతం పలికారు. మోడీ రాకతో నగరంలోని పలు రోడ్లు కాషాయంగా మారాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి నారాయణ గూడ, వైఎంసీఏ మీదుగా కాచిగూడ వరకు మోడీ రోడ్ షో సాగింది. ఈ రోడ్డు షోలో ప్రధానితోపాటు టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy), కే.లక్ష్మణ్ పాల్గొన్నారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగింది. ప్రధాని రోడ్ షో సందర్భంగా ఈ ప్రాంతమంతా కాషాయమయమైంది. దారి పొడవునా బీజేపీ శ్రేణులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా..ప్రజలకు అభివాదం చేస్తూ మోడీ ముందుకు సాగారు.
మోడీ రోడ్ షో నేపథ్యంలో హైదరాబాద్ నగర మెట్రో రైలు (HYD Metro) ప్రయాణికులకు కీలక సూచనలు తెలియజేసింది. నేటి (సోమవారం) సాయంత్రం రెండు గంటలపాటు చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈరోజు మోడీ తెలంగాణ లోని పలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన కాంగ్రెస్ , బిఆర్ఎస్ పార్టీల ఫై నిప్పులు చెరిగారు. తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తాం. హిందూ దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో ఉంచుతాం. బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుందని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
పదేళ్లుగా తెలంగాణ అభివృద్ది కుంటుపడింది. పదేళ్ల పిల్లల భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఆలోచించి, నిర్ణయం తీసుకోవాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. కాంగ్రెస్, బీఆర్ఎస్ మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేశాయి. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బీఆర్ఎస్‌కు ఓటేసినట్లే. రెండు పార్టీలూ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎప్పుడు బీఆర్ఎస్‌కు వెళ్తారో తెలియదు. దేశంలోని అన్ని రాష్ట్రాలను బీజేపీ అభివృద్ధి చేస్తుంది. కేసీఆర్ వద్దనుకుంటే కాంగ్రెస్‌కు కూడా ఓటేయొద్దు. తెలంగాణ నుంచి పీవీ నరసింహా రావు ప్రధాని అయ్యారు. కుటుంబ పాలనలో పీవీకి అన్యాయం జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటే అవినీతి, కుటుంబ పాలనే అని ధ్వజమెత్తారు.
Read Also : Dasoju Sravan: చిల్లర రాజకీయాల కోసం లక్షలాది రైతుల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం