MLC Kavitha: బాల గంగాధర తిలక్ నా ఇన్సపిరేషన్!
బాల గంగాధర తిలక్ స్పూర్తితో తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మీర్ పేట పరిధిలోని టి.కె.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్సీ
- By Balu J Published Date - 10:11 PM, Fri - 30 September 22

బాల గంగాధర తిలక్ స్పూర్తితో తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మీర్ పేట పరిధిలోని టి.కె.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. బాల గంగాధర తిలక్ తన ఇన్సపిరేషన్ అన్న ఎమ్మెల్సీ కవిత, స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. గణేష్ ఉత్సవాలు నిర్వహించి, ప్రజలను ఒక దగ్గర చేర్చి, స్వాతంత్ర్యం కోసం ఎందుకు కొట్లాడాలో బాల గంగాధర తిలక్ ప్రజలకు వివరించే వారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. దాన్ని స్టడీ చేసిన తర్వాత, తెలంగాణలో ఇలా ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చి, ఉద్యమ సమయంలో బతుకమ్మ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు ఎమ్మెల్సీ కవిత.
పూలనే దేవుడిగా పూజించే బతుకమ్మ లాంటి పండుగ ప్రపంచంలో తెలంగాణలో తప్ప మరేక్కడా లేదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. అనంతరం విద్యార్థినిలతో కలిసి ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జెడ్పీ ఛైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం శంషాబాద్ అమ్మపల్లి సీతారామ చంద్ర స్వామి ఆలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత, యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్ తో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.