HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Mlc Kavitha Hard Comment On Bjp Govt

MLC Kavitha: పాలు ,పెరుగు, నెయ్యిపై కూడా బీజేపీ పన్ను విధిస్తోంది: కవిత

పాలు, పెరుగు, నెయ్యి మీద బీజేపీ ప్రభుత్వం పన్నులు వేస్తోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.

  • By Balu J Published Date - 05:22 PM, Mon - 6 March 23
  • daily-hunt
Mlc Kavitha, chandrababu
Mlc Kavitha

దేశంలో బీజేపీ పాలనలో ఏది కొనాలన్నా అగ్గిలో చేయిపెట్టనట్టు ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.
బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా పెరుగు, పాలు, నెయ్యి మీద పన్నులు విధించలేదని, కానీ పాలు, పెరుగు, నెయ్యి మీద బీజేపీ ప్రభుత్వం పన్నులు వేస్తోందని విమర్శించారు. ఈరోజు మార్కెట్ కి పోయి ఏదైనా కొనాలని చూస్తే అగ్గిల చెయ్యి పెట్టే పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. ఈరోజు ఏది కొన్ని పరిస్థితి లేదని అన్నారు. కందిపప్పు, నూనెలతో పాటు ఇతర నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని వివరించారు. ముఖ్యంగా సిలిండర్ ధరలు చూస్తే మళ్ళీ కట్టెల పొయ్యి పెట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్నిటిపై సబ్సిడీలు ఇచ్చి ప్రజలపై భారాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. కాబట్టి మన కోసం ఎవరు పనిచేస్తున్నారన్న విషయాన్ని ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ రామ్ లీలా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత మంత్రులు గంగుల కమలాకర్ , సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. తొలుత ఎల్ఎండీ కాలనీ లోనీ అమరవీరుల స్థూపం వద్ద వీరు నివాలుళర్పించారు. అనంతరం ర్యాలీగా రామ్ లీలా మైదానానికి బయలుదేరి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవితకు స్థానికులు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.

కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ… మహిళా సంఘాలకు దేశంలో ఎక్కడాలేని విధంగా రుణాలు ఇస్తున్నామని, మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న 54 లక్షల మంది మహిళలకు ఏడాది రూ. 18 వేల కోట్ల రూపాయలు రుణాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో మహిళా సంఘాల వ్యాపారం చేసుకోవడానికి రూ. 20 లక్షలు కెసిఆర్ ప్రభుత్వం అందిస్తున్నదని పేర్కొన్నారు. వడ్డీ లేని రుణాలు, అభయ హస్తం నిధులు త్వరలోనే విడుదలవుతాయని ప్రకటించారు. వీఏవోల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు.

“అమ్మ లేకపోతే ఆడబిడ్డ లేకపోతే ఒక్కరోజు కాదు ఒక గంట కూడా ఇల్లు గడవదు. ఉదయాన్నే లేచి ఇల్లు చక్కదిద్దుతారు. ఇప్పుడు మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. అవకాశాలను అందిపుచ్చుకునే ఆత్మస్థైర్యం ఆడబిడ్డలకు రావాలి.” అని అన్నారు. తెలంగాణ రాకముందు ఆడపిల్లలను చదివించాలంటే బస్సులు లేక, విద్యా సంస్థల్లో టాయిలెట్లు లేక సమస్యగా ఉండేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని, గ్రామాల నుంచి మండల కేంద్రాలకు రోడ్లు వేసుకున్నామని, పల్లె వెలుగు బస్సుల సౌకర్యం పెరిగిందని, రూ. 8 వేల కోట్లతో ప్రతీ పాఠశాలలో బాత్ రూం లను కెసిఆర్ ప్రభుత్వం దశలవారీగా నిర్మిస్తుందని వివరించారు. ఎస్సీ, బీసీ మహిళా విద్యార్థుల కోసం డిగ్రీ కాలేజ్ హాస్టల్లు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని తేల్చి చెప్పారు. ఆడపిల్లలను చదివించాలని పిలుపునిచ్చారు. పెళ్లి చేయడానికి 18 ఏళ్ల వయస్సు వచ్చేవరకు చదువు తప్ప ఏ పని ఉండకూడదని అభిప్రాయపడ్డారు. వివాహాన్ని కూడా ఆడబిడ్డల మేనమామ కేసీఆర్ చూసుకుంటారని, కళ్యాణలక్ష్మి అందిస్తున్నారని చెప్పారు.

పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా ఇతర శాఖలలో కూడా రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. చదువుకుంటే ప్రభుత్వంతోపాటు ప్రైవేటు ఉద్యోగాల్లో అవకాశాలు లభిస్తాయని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 24 గంటల నిరంతర విద్యుత్తు అందించడం వల్ల దాదాపు 20 వేల పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని, దాంతో దాదాపు 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చుకోగలిగామని వివరించారు. ప్రభుత్వం కూడా దాదాపు రెండున్నర లక్షల ఉద్యోగాలు కల్పించిందని గుర్తు చేశారు. కాబట్టి ఆడపిల్లల చదువు విషయంలో రాజీ పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఆస్తులు ఇవాళ ఉంటే రేపు పోవచ్చు కానీ చదువు జీవితాంతం తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు. చిన్నప్పుడు తన తల్లి పట్టుబట్టి తనను చదివించిందని, అందువల్లనే ఈరోజు ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానని తెలిపారు. ఎంత కష్టమైనా ఎంతవరకైనా ఆడబిడ్డను చదివించాలని సూచించారు.

కేవలం చదివించడమే కాకుండా వ్యాపారాల వైపు కూడా మళ్లించే ప్రయత్నం చేయాలని అన్నారు. వ్యాపారం పెట్టి మరింత మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఆడపిల్లలకు చిన్నప్పటినుంచే ప్రోత్సహించాలని తెలిపారు. ఆడపిల్లల్లో ఉద్యోగవేత్తలు నే కాదు వ్యాపారవేత్తలను కూడా తయారు చేయాలని స్పష్టం చేశారు. కేవలం మహిళా దినోత్సవం సందర్భంగా అని ఇలాంటి ఆలోచనలు చేయడం కాదని ప్రతిరోజు ఇలాంటి ఆలోచనలు చేయాలని ప్రతిరోజు మహిళా దినోత్సవం కావాలని అన్నారు.

గతంలో ఎప్పుడు లేని విధంగా, ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల కోసం కేసీఆర్ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. కళ్యాణ లక్ష్మితో పాటు గర్భిణి స్త్రీలకు, ఆడపిల్లల చదువులకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ప్రభుత్వం అందించే డబుల్ బెడ్రూంలో కూడా మహిళల పేర్ల మీదనే ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. సొంత స్థలం ఉన్నవాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి రూ 3 లక్షలు ప్రభుత్వం త్వరలోనే అందిస్తుందని అన్నారు.

బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా పెరుగు, పాలు, నెయ్యి మీద పన్నులు విధించలేదని, కానీ పాలు, పెరుగు, నెయ్యి మీద బీజేపీ ప్రభుత్వం పన్నులు వేస్తోందని విమర్శించారు. ఈరోజు మార్కెట్ కి పోయి ఏదైనా కొనాలని చూస్తే అఖిల చెయ్యి పెట్టే పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. ఈరోజు ఏది కొన్ని పరిస్థితి లేదని అన్నారు. కందిపప్పు, నూనెలతో పాటు ఇతర నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని వివరించారు. ముఖ్యంగా సిలిండర్ ధరలు చూస్తే మళ్ళీ కట్టెల పొయ్యి పెట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్నిటిపై సబ్సిడీలు ఇచ్చి ప్రజలపై భారాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. కాబట్టి మన కోసం ఎవరు పనిచేస్తున్నారన్న విషయాన్ని ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • central government
  • MLC Kavitha

Related News

Gold

Gold Rates : జీఎస్టీ రేట్ల సవరణతో బంగారం ప్రియులకు శుభవార్త..ఎంతవరకు తగ్గే చాన్స్ అంటే?

Gold Rates : బంగారంపై వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) రేట్లలో కేంద్రం సవరణలు చేయడంతో బంగారం ధరలు తగ్గుతాయని టాక్ వినిపిస్తోంది.

  • Kavitha

    Kavitha : కవిత సంచలన వ్యాఖ్యలు..నాపై దుష్ప్రచారం, బీసీల కోసం పోరాడినందుకే సస్పెండ్..!

  • Kavitha to resign from MLC post.. Key press meet afterwards!

    Kavitha : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్న కవిత.. అనంతరం కీలక ప్రెస్ మీట్ !

  • Kavitha suspended from BRS

    BIG BREAKING: BRS నుంచి కవిత సస్పెండ్

  • Telangana Jagruti

    Kavitha New Party : కవిత కొత్త పార్టీ.. రిజిస్ట్రేషన్ కంప్లీట్?

Latest News

  • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

  • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd