HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mlc By Election Polling Concluded

MLC By Poll : ముగిసిన MLC ఉపఎన్నిక పోలింగ్

ఈరోజు ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ జరిగింది

  • Author : Sudheer Date : 27-05-2024 - 7:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mlc Bypollcom
Mlc Bypollcom

ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ (MLC By polling) ప్రశాంతంగా ముగిసింది. గత ఆరు నెలలుగా తెలంగాణ లో వరుస ఎన్నికలు ..రాష్ట్రంలో సందడిగా మారాయి. నవంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగా..మొన్న పార్లమెంట్ , ఈరోజు ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. 4 గంటల వరకు క్యూ లైన్లో నిల్చున్న వారికీ ఓటు హక్కు కల్పించారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలింగ్ జరిగింది. జూన్ 5వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నిక బరిలో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్), బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మొత్తంగా 52 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. శాసనసభ ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్ధిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో, 605 పోలింగ్ కేంద్రాల్లో ఉపఎన్నిక జరుగగా… అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 118, అతితక్కువగా సిద్దిపేటలో 5 కేంద్రాల్లో పోలింగ్‌ సాగింది.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి హనుమకొండలో‍ ఓటేయగా, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామలో, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి తొర్రూరులో , వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, నల్గొండలో కలెక్టర్‌ చందన, ఇతర అధికారులు ఓటు వేశారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, భువనగిరి జిల్లా తుర్కపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న, వరంగల్‌ కాశీబుగ్గలోని వివేకానంద కళాశాలలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్‌ ఓటేశారు.

Read Also : Amit Shah : కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటదు – అమిత్ షా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • MLC By-Election
  • telangana
  • Warangal-Khammam-Nalgonda graduates

Related News

Revanth Vem

Rajyasabha : వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ టికెట్..? సీఎం రేవంత్ మాట నెగ్గుతుందా ?

అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం ఈ రెండు సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకి చేరడం లాంఛనమే అయినప్పటికీ, ఆ సీట్ల కోసం సాగుతున్న అంతర్గత పోటీ ఇప్పుడు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది

  • Revanth Reddy

    తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

  • CM Revanth Leadership

    CM Revanth : కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..ఈసారి ఎందుకంటే !!

  • Praja Palana Pragati Pran

    Praja Palana – Pragati Pranalika : మే 18 నుంచి ఆటల పోటీలు.. జాబ్ మేళాలు!

  • Learning English is not a shame, it is a symbol of student empowerment: Rahul Gandhi

    Rahul : కాసేపట్లో తెలంగాణకు రాహుల్ గాంధీ

Latest News

  • కొత్త సుప్రీం లీడర్ ఇత‌నే.. ఆయ‌న ఆస్తి విలువ ఎంతో తెలుసా?!

  • ఇరాన్ యుద్ధ నౌక‌పై అమెరికా దాడి.. 28 మంది మృతి, 100 మందికిపైగా గ‌ల్లంతు!

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌.. ఫైన‌ల్‌కు చేరిన తొలి జ‌ట్టు ఇదే!

  • ముంబై వాంఖ‌డే పిచ్‌.. క్యూరేటర్‌పై గంభీర్ అస‌హ‌నం?!

  • భార‌త మార్కెట్‌లో అత్యంత చౌకైన బైక్ ఇదే!

Trending News

    • ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి తుది వీడ్కోలు.. ఖ‌న‌నం ఎక్క‌డంటే?

    • రెండు వేల రూపాయ‌ల నోట్లు ఇంకా ఎందుకు బయట ఉన్నాయి?

    • రేపే భార‌త్‌- ఇంగ్లాండ్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌.. ఈ ఆట‌గాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • ఇరాన్‌ లో ఓ వైపు యుద్ధం, మరోవైపు భూకంపం

    • శబరిమలలో మహిళలకు నో ఎంట్రీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd