MLA Rajaiah: బోరున ఏడ్చిన రాజయ్య, కేసీఆర్ తోనే ఉంటానంటూ!
తనకు టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్యే రాజయ్య కంటతడి పెట్టారు.
- Author : Balu J
Date : 22-08-2023 - 5:50 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణాలోని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఎన్నికల టిక్కెట్ రాకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విధేయుడిగా ఉంటానని ప్రకటించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక కాకపోవడంపై రాజయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి, రాజయ్యల మధ్య పోటాపోటీ ఉండటంతో ఘన్‌పూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇద్దరు నేతలూ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నప్పటికీ చివరకు సీఎం కేసీఆర్ కడియంను ఎంపిక చేశారు.
టికెట్ ప్రకటించిన తర్వాత తొలిసారిగా తన నియోజకవర్గానికి వచ్చిన రాజయ్యను పెద్ద ఎత్తున మద్దతుదారులు కలిశారు. మద్దతు తెలపడంతో పొంగిపోయిన ఆయన భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. నేలపై పడుకొని పాదాభివందనం చేస్తూ ఏడ్చేశారు. తనపై విశ్వాసం ఉన్నవారి కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి తన ప్రస్తుత పాత్రకు మించిన ఇతర ముఖ్యమైన బాధ్యతలను తనకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే కేసీఆర్ అండదండలతో, కేటీఆర్ ఆశీస్సులతో తనకే టికెట్ వస్తుందని రాజయ్య ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ విడుదల చేసిన ఫస్ట్ లిస్టులో రాజయ్య పేరు లేకపోవడంతో దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్టయింది. తనకే టికెట్ వస్తుందని ఆశించిన రాజయ్య కు ఊహించని దెబ్బ తగిలింది.
అయితే స్టేషన్ ఘన్ పూర్ లో కడియం శ్రీహరికి మంచి పేరుండటం, ఇతర నేతలు కూడా కడియం వైపు మొగ్గు గులాబీ బాస్ రాజయ్యను పక్కన పెట్టేశాడు. ఇక రాజయ్యపై అవినీతి ఆరోపణలు ఉండటం ఒక కారణమైతే, సర్పంచ్ నవ్య రాజయ్యపై సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. లైంగిక వేధింపుల ఆరోపణల వల్ల బీఆర్ఎస్ ప్రతిష్ట దెబ్బతింది. ఇక దళిత బంధులో కూడా రాజయ్య అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నారనే విమర్శలు వినిపించాయి. అందుకే రాజయ్యను పక్కన పెట్టి ఉండవచ్చునని స్థానిక బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నారు.
Also Read: Tribal People: అడవి బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతున్న విద్యుత్ ఉద్యోగి