MLA Rajaiah: ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు.. ఆపై బోరున ఏడుపు!
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బోరున ఏడ్చారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
- By Balu J Updated On - 03:26 PM, Wed - 15 March 23

హనుమకొండ జిల్లా: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (MLA Rajaiah) కొద్దిరోజులుగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం మీడియాముందుకొచ్చిన రాజయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు రండా రాజకీయాలు చేస్తున్నారని, ధైర్యం ఉంటే ఫేస్ టు ఫేస్ రాజకీయాలు (Politics) చేయాలని అన్నారు. జిల్లాలో ఏ సర్వే చూసినా ముందు వరుసలో ఉన్నానని అన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఫాదర్ కొలంబో ఆశిస్సులతో ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎవరు ఏం చేసినా భయపడే ప్రసక్తి లేదని, చివరి ఊపిరి ఉన్నంతవరకు ఘనపూర్ నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నాకు దేవుళ్ళు అని (MLA Rajaiah) అన్నారు. అయితే తన బాధను చెప్పుకుంటూ రాజయ్య (MLA Rajaiah) కంటతడి పెట్టుకున్నారు. దీంతో కార్యకర్తలు ఆయన్ను ఆపే ప్రయత్నం చేశారు.

Related News

Ram Charan Emotion: ఆ దృశ్యాన్ని తెరపై చూసినప్పుడు కన్నీళ్లు ఆగలేదు: రామ్ చరణ్
దాదాపు 280 కోట్లతో తెరకెక్కిన సైరా సినిమాలో చిరంజీవి గొప్ప యోధుడిగా నటించి ఆకట్టుకున్నాడు.