MLA Krishnamohan: ఎమ్మెల్యే కృష్ణమోహన్ పార్టీ మార్పు అవాస్తవం: మంత్రి జూపల్లి
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
- By Gopichand Published Date - 11:36 AM, Thu - 1 August 24

MLA Krishnamohan: గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి (MLA Krishnamohan) కాంగ్రెస్‌లో నుంచి బీఆర్ఎస్‌లో చేరినట్లు వస్తున్న వార్తల్లో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోనే ఉన్నారని, బీఆర్ఎస్ పార్టీలో చేరలేదని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘‘నియోజకవర్గ అభివృద్దికోసం కృష్ణమోహన్ బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. కేటీఆర్‌ను ఆయన స్నేహపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారనే వార్తల్లో నిజం లేదు. ఎమ్మెల్యే కోరినట్టు ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. కృష్ణమోహన్‌తో కలిసి ఈరోజు అసెంబ్లీకి వెళుతున్నాం’’ అని చెప్పుకొచ్చారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాత పరిచయాల నేపథ్యంలో అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ నాయకులను కృష్ణమోహన్ రెడ్డి కలిశారు తప్ప బిఆర్ఎస్ పార్టీలో చేరలేదని పేర్కొన్నారు. మీడియాలో వదంతులు తప్ప కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడి వెళ్లలేదని, కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని తెలిపారు.
Also Read: CM Chandrababu : ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు
ఇటీవల అధికార పార్టీ కాంగ్రెస్‌లో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మళ్లీ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో చేరారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయనతోపాటే మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు వదంతులు వచ్చాయి. మరోవైపు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్‌రావు కూడా మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి వెళ్లే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వస్తే ఆయన ఆ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, బీఆర్ఎస్‌లో చేరేది లేదని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్‌లో చేరినట్లు స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.