Miss And Mrs Strong: మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ బ్యూటిఫుల్ సీజన్ 2 పోస్టర్ ఆవిష్కరణ!
వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి మహిళ తన నైపుణ్యాన్ని, సౌందర్యాన్ని ఫ్యాషన్ వేదికపై ప్రదర్శించేలా ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
- By Gopichand Published Date - 05:49 PM, Tue - 15 April 25

Miss And Mrs Strong: హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ (Miss And Mrs Strong) ఈవెంట్ అపూర్వ విజయాన్ని సాధించిన సందర్భంగా నిర్వాహకులు ఒక సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ సీజన్ 2ను అధికారికంగా ప్రకటించారు. ఈ సీజన్ 2కు సంబంధించిన పోస్టర్‌ను ఈవెంట్ ఫౌండర్ కిరణ్మయి అలివేలు, సీజన్ 1 విజేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఔత్సాహిక మహిళలకు ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తుందని కిరణ్మయి అన్నారు.
కిరణ్మయి మాట్లాడుతూ.. ఈ వేదిక యువతుల ఆలోచనలను, ఆశయాలను వెలికితీసేందుకు ఉద్దేశించినదని తెలిపారు. “పెళ్లి అనేది జీవితంలో ఆశలకు ముగింపు కాదు. మరో అద్భుతమైన ఆరంభం” అని ఆమె పేర్కొన్నారు. మహిళల సౌందర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని గ్రాండ్‌గా ప్రదర్శించేందుకు ఈ ఈవెంట్ ఒక వేదికగా ఉంటుందని ఆమె వివరించారు. జాతీయ స్థాయిలో ఫ్యాషన్ షోలు, బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొన్న తన అనుభవాన్ని గుర్తు చేస్తూ, ఔత్సాహిక మహిళలకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించినట్లు కిరణ్మయి తెలిపారు.
Also Read: MLC Addanki Dayakar : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి మహిళ తన నైపుణ్యాన్ని, సౌందర్యాన్ని ఫ్యాషన్ వేదికపై ప్రదర్శించేలా ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా క్యాన్సర్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించడంతో పాటు, సామాజిక బాధ్యతలో భాగంగా వివిధ సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు కిరణ్మయి వెల్లడించారు. ఈ కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పులను తీసుకురావాలని తాము కోరుకుంటున్నామని ఆమె అన్నారు.
సీజన్ 2 ప్రకటన సందర్భంగా సీజన్ 1లో విజేతలుగా నిలిచిన మహిళలు ర్యాంప్ వాక్‌తో ప్రేక్షకులను అలరించారు. వారి ఆత్మవిశ్వాసం, శైలి అందరినీ ఆకర్షించాయి. ఈ ఈవెంట్ మహిళల సామర్థ్యాన్ని, సౌందర్యాన్ని జరుపుకునే వేదికగా నిలిచింది. సీజన్ 2 కోసం మరిన్ని ఆసక్తికర అంశాలు, అవకాశాలు సిద్ధంగా ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ వేదిక ద్వారా మహిళలు తమ కలలను సాకారం చేసుకోవడంతో పాటు, సమాజంలో స్ఫూర్తిగా నిలవాలని కిరణ్మయి ఆకాంక్షించారు.