Runamafi : త్వరలోనే మిగిలిన అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తాం – పొంగులేటి
దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులకు రుణమాఫీ చేశామని, ఇలా ఏ రాష్ట్రం కూడా ఏకకాలంలో రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు
- By Sudheer Published Date - 05:31 PM, Fri - 23 August 24

రుణమాఫీ (Runamafi) ఫై బిఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను , విమర్శలను ఖండించారు మంత్రి పొంగులేటి (Minister Ponguleti srinivasa reddy). కొన్ని టెక్నికల్ కారణాలతో కొందరి రైతుల ఖాతాలో మాఫీ నిధులు జమ కాని మాట వాస్తవం అని, మరికొందరు రైతులు 2 లక్షలకు మీద ఉన్న డబ్బులను కట్టకపోవడం వల్ల మాఫీ డబ్బులు జమ కాలేదని , కొద్ది రోజుల్లోనే మిగిలిన అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని మంత్రి స్పష్టం చేసారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులకు రుణమాఫీ చేశామని, ఇలా ఏ రాష్ట్రం కూడా ఏకకాలంలో రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక కటాఫ్ డేట్ పెడుతుందని, అంతలోపు రైతులు ఆ రెండు లక్షలకు మీద ఉన్న డబ్బులు కట్టాలని, వారందరికీ మాఫీ చేస్తామని వివరించారు.
We’re now on WhatsApp. Click to Join.
తాము అనుకున్న ప్రకారమే.. రూ. 31 వేల కోట్లలోనే అంకెలు ఉంటాయని పేర్కొన్నారు. ఇంకా ఒక వెయ్యో.. మరో 1500 కోట్లో పెరిగే అవకాశం ఉన్నా తాము అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని, రుణమాఫీ విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని స్పష్టం చేశారు. తెలంగాణను కేసీఆర్ ధనిక రాష్ట్రం అన్నారని, కానీ, ఖజానా అంతా ఖాళీగా ఉన్నదని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అప్పు చూసి షాక్ అయ్యామని తెలిపారు. తాము అధికారం చేపట్టగానే దుబారా ఖర్చులు తగ్గించి రైతును రాజు చేసే పనిలో మునిగిపోయామని వివరించారు.
పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 16 నుంచి 17 వేల కోట్ల రుణమాఫీ చేసిందని, ఈ ప్రభుత్వం వచ్చి పది నెలలు కూడా కాలేదని, కానీ, రూ. 31 వేల కోట్ల రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తున్నదని వివరించారు. అనేక గిమ్మిక్కులు చేసి కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడని, కానీ, ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకోలేదని మంత్రి పొంగులేటి విమర్శించారు.
Read Also : KTR : చలో ఢిల్లీ కాదు.. చలో పల్లె చేపట్టాలి.. సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్