Minister Ponguleti: కేసీఆర్ కాళ్లే పట్టుకున్నా.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
.. బావ-బామ్మర్దులు నిత్యం ఇందిరమ్మ ప్రభుత్వం మీద గుడ్డకలిచి మీద వేస్తున్నారు. తల తాకట్టు పెట్టి అయిన డిసెంబర్ లోపే మిగతా 13 వేల కోట్లు రుణమాఫీ చేస్తాం. రుణ మాఫీ అయ్యాక నీ తల ఏ టైర్ కింద పెడుతావో ఆలోచించుకో. తప్పకుండా రైతు భరోసాను ఇందిరమ్మ ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వ భూములను నీ తొత్తులకు రాసి రైతు బంధు తిన్నారు.
- By Gopichand Published Date - 04:21 PM, Thu - 7 November 24

Minister Ponguleti: బీఆర్ఎస్‌పై మంత్రి పొంగులేటి (Minister Ponguleti) శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తొర్రూర్ వ్యవసాయ నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొర్రూరు మార్కెట్ కమిటీకి ప్రభుత్వం తరుపున అభినందనలు. కరెక్ట్ గా ఈరోజే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన రోజు. 11 నెలల ఇందిరమ్మ ప్రభుత్వంలో BRS అరాచకాలు ఒక్కొక్కటగా బయటపడుతున్నాయి. తెలంగాణ ప్రజల నెత్తురును బీఆర్ఎస్ దోచుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజల కోసం కష్టపడుతున్నారు. రైతులకు 24 శాతం నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందన్నారు.
ఇంకా మాట్లాడుతూ.. బావ-బామ్మర్దులు నిత్యం ఇందిరమ్మ ప్రభుత్వం మీద గుడ్డకలిచి మీద వేస్తున్నారు. తల తాకట్టు పెట్టి అయిన డిసెంబర్ లోపే మిగతా 13 వేల కోట్లు రుణమాఫీ చేస్తాం. రుణ మాఫీ అయ్యాక నీ తల ఏ టైర్ కింద పెడుతావో ఆలోచించుకో. తప్పకుండా రైతు భరోసాను ఇందిరమ్మ ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వ భూములను నీ తొత్తులకు రాసి రైతు బంధు తిన్నారు. ఈ పంట నుండి రైతులకు సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే స్మాట్ కార్డే అన్ని పథకాలకు పని చేస్తుంది. BRS ఉపఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మాత్రమే రేషన్ కార్డు ఇచ్చింది. ధరణి పేరుతో BRS నాయకులు, తొత్తులు కబ్జా చేశారు. HYD చుట్టూ ఉన్న భూములను BRS నాయకులు దోచుకున్నారన్నారు.
Also Read: Mother Kidnapped : కొడుకు అప్పు తీర్చడం లేదని.. తల్లిని కిడ్నాప్ చేసిన కాంట్రాక్టర్
BRS అరచాకలతో భూ వ్యవస్థను అస్తవ్యస్థం చేశారు. త్వరలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తాం.. అది దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈనెల ఆఖరు లోపు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పెద్ద గుండె… పెద్ద మనస్సు. గ్రామసభల ద్వారా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. BRS నాయకులు లాగా బకాసురులను ఎంపిక చెయ్యం. మాజీ మంత్రి ఎర్రబెల్లి కక్కుతున్న విషం ప్రజలు గమనిస్తున్నారు. తప్పు చేస్తే.. పేద వాడిని ఇబ్బంది పెడితే.. కాపలాలాగా ఇందిరమ్మ ప్రభుత్వం ఉంటుందని హెచ్చరించారు.
శ్రీనివాస్ రెడ్డి హోమ్ మంత్రా?… అలా ఎందుకు మాట్లాడుతున్నాడని అంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి క్యాబినెట్ మంత్రి..మంత్రిగా నేను ఏ శాఖ గురించి అయిన మాట్లాడవచ్చు. ఎర్రబెల్లి దయాకర్ ఎందుకు అంతా ఉలిక్కి పడుతున్నావు . కేటీఆర్ పాదయాత్ర చేస్తానంటే నేను వ్యక్తిగతంగా… కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. BRS అధికార మదంతో కండ్లు నేతికెక్కి కనీసం మనుషులుగా చూడలేదు. పాదయాత్ర చేస్తావా?… మోకాళ్ళ యాత్ర చేస్తావా? నువ్వు నిర్ణయం తీసుకో కేటీఆర్. ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఒకటో, రెండో కోట్లు ఇచ్చి మీ పాపాన్ని శుద్ధి చేసుకొండి. ఈ పార్టీ నేతలను.. ఆ పార్టీ నేతలను అరెస్టు చేస్తారని నేనెప్పుడూ చెప్పలేదు. మీరు ఎందుకు అంతా ఉలిక్కి పడుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి అంబానీ కాళ్ళు మొక్కడని ప్రచారం చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఎవరు కాళ్ళు పట్టుకోడు.. ఒకే ఒకసారి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా. నాయనాతో సమానంగా కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా కానీ నా గొంతుతో పాటు నమ్ముకున్న వాళ్ళ గొంతు కోసారన్నారు.
నాకు చట్టం తెలుసు.. ఎప్పుడూ, ఎక్కడ ఏమీ జరగాలో అది జరుగుతుంది. వరంగల్ జిల్లాను రెండో రాజధానిగా తప్పకుండా చేసి తీరుతాం. మామునూరు ఎయిర్‌పోర్టులో విమానాలు దించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వరంగల్ నగరం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పొంగులేటి కామెంట్స్ చేశారు.