HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Ktr Tweet On Congress

Minister KTR : కాంగ్రెస్ గ్యారెంటీల‌పై కేటీఆర్ ట్వీట్‌.. అర్ధ శతాబ్దపు పాలనంతా…?

తెలంగాణ‌లో నిన్న కాంగ్రెస్ పార్టీ విజ‌య‌భేరీ సభ నిర్వ‌హించింది. ఈ స‌భలో ఆరు గ్యారెంటీల‌ను ప్ర‌క‌టించింది. అయితే కాంగ్రెస్

  • Author : Prasad Date : 18-09-2023 - 1:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KT Rama Rao
Telangana Minister KTR America Tour

తెలంగాణ‌లో నిన్న కాంగ్రెస్ పార్టీ విజ‌య‌భేరీ సభ నిర్వ‌హించింది. ఈ స‌భలో ఆరు గ్యారెంటీల‌ను ప్ర‌క‌టించింది. అయితే కాంగ్రెస్ ప్ర‌క‌టించిన గ్యారంటీల‌పై బీఆర్ఎస్ నేత‌లు మండిప‌డ్డారు. ఎన్ని హ‌మీలు ఇచ్చిన కాంగ్రెస్‌కు ఓట్లు ప‌డ‌వ‌ని మంత్రి హ‌రీష్ రావు తెలిపారు. ఇటు మంత్రి కేటీఆర్ కూడా వ్యంగంగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌వి క‌ల్ల‌బొల్లి గ్యారెంటీలంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అర్థ‌శ‌తాబ్ధ‌పు పాల‌న అంతా మోసం, వంచ‌న ద్రోహ‌మంటూ ట్వీట్ చేశారు. కాల‌కేయుల కాల‌మొస్తే మ‌ళ్లీ క‌రెంట్ కోత‌లు.. క‌టిక చీక‌ట్లు గ్యారెంటీ అంటూ వ్యంగ‌స్త్రాలు సంధించారు…
కేటీఆర్ ట్వీట్ ఇలా…

మోసం..వంచన.. ద్రోహం..దోఖాలమయం
కాంగ్రెస్ అర్ధ శతాబ్దపు పాలనంతా..!

ఇది..మీ కపట కథలు..కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన
తెలివైన తెలంగాణ గడ్డ..!

కల్లబొల్లి గ్యారెంటీలు చెల్లవ్ ఇక్కడ..!
……..
రాబందుల రాజ్యమొస్తే
రైతుబంధు రద్దవడం గ్యారెంటీ..!

కాలకేయుల కాలం వస్తే
కరెంట్‌ కోతలు..కటిక చీకట్లు గ్యారెంటీ..!

మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే
మూడు గంటల కరెంటే గతి..
ఉచిత విద్యుత్ ఊడగొట్టడం గ్యారెంటీ..!

దగాకోరుల పాలనొస్తే
ధరణి రక్షణ ఎగిరిపోవడం గ్యారెంటీ..!

బకాసురులు గద్దెనెక్కితే
రైతుబీమా..ధీమా గల్లంతవ్వడం గ్యారెంటీ..!

సమర్థతలేని సన్నాసులకు ఓటేస్తే
సకల రంగాల్లో సంక్షోభం గ్యారెంటీ..!

ఢిల్లీ కీలుబొమ్మలు కుర్చీఎక్కితే
ఆత్మగౌరవాన్ని అంగట్లో తాకట్టు పెట్టడం గ్యారెంటీ..!

దొంగల చేతికి తాళాలు ఇస్తే
సంపదనంతా స్వాహా చేయడం గ్యారెంటీ..!

భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే
బూడిద మిగలడం గ్యారెంటీ…!

స్కాముల పార్టీకి స్వాగతం చెబ్తే
స్కీములన్ని ఎత్తేయడం గ్యారెంటీ..!

కర్షకుడి కష్టం తెలియనోళ్లకు సీటిస్తే
అన్నదాత ఆగమైపోవడం గ్యారెంటీ..!

పరిపాలన చేతగాని..చేవలేనివాళ్లకు పగ్గాలిస్తే
పల్లెపల్లెనా మళ్లీ పల్లేర్లు మొలవడం గ్యారెంటీ..!

పనికిమాలిన వాళ్లు పవర్‌లోకి వస్తే
పరిశ్రమలు పారిపోవడం గ్యారెంటీ..!

బుద్ధికుశలత లేనోళ్లకు చోటిస్తే
భూముల ధరలు పడిపోవడం గ్యారెంటీ..!

విషయం..విజ్ఞానం లేనోళ్లను విశ్వసిస్తే
వికాసం మాయమై వినాశనం గ్యారెంటీ..!

థర్డ్ గ్రేడ్ నాలాయక్స్ ను నమ్ముకుంటే
ప్రథమ స్థానంలో వున్న స్టేట్ అధమస్థాయికిపోవడం గ్యారెంటీ..!

ఆర్థికశాస్త్రం తెలియని అరాచకులకు అవకాశం ఇస్తే
ఎకానమీ ఏట్లో గలవడం గ్యారెంటీ..!

జోకర్లకు..బ్రోకర్లకు పీఠం ఇస్తే
పరువు ప్రతిష్ఠలు గంగలో కలవడం గ్యారెంటీ..!

దాచి..దాచి దెయ్యాలకు పెట్టేంత
ఎడ్డిది కాదు..నా తెలంగాణ..!

ఈనగాచి నక్కల పాల్జేసేంత
అమాయక నేల కాదు నా తెలంగాణ..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • minister ktr
  • telangana
  • tpcc chief revanth

Related News

Tdp Mp Lavu Sri Krishna Devarayalu

లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

Mp Lavu Sri Krishna Devarayalu  ఇటీవల పార్లమెంటులో ఏపీ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణను అవమానించేలా ఉన్నాయంటూ.. తెలంగాణ రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై మాట్లాడుతూ బ్లాక్ డే అంటూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వ్యవహారం కాస్తా తీవ్ర దుమారానికి కారణం కావడంతో.. ఆయన స్పందించారు. తాను తెలంగ

  • Central Govt Good News2

    Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

  • Kavita Fire

    Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

  • Cm Revanth Key Update On Fr

    Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • New Amrit Bharat Express.

    తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd