Konda Surekha : మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ
Minister Konda Surekha : గురుకులాల్లో కుట్రల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) హస్తం ఉందని ఆమె ఆరోపించారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పని చేశారని గుర్తు చేశారు.
- By Sudheer Published Date - 07:27 PM, Fri - 29 November 24

మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) ఇటీవల వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్నారు. చేసే కామెంట్స్ మాత్రమే కాదు చేసే పనులు కూడా ఆమెను వివాదాల్లోకి నెట్టిస్తున్నాయి. ఆ మధ్య నాగార్జున ఫ్యామిలీ పై అలాగే సమంత పై చేసిన కామెంట్స్ ఆమెను వివాదాల్లో కేరాఫ్ గా నిలపడమే కాదు యావత్ సినీ ప్రముఖులు , అభిమానులు , చిత్రసీమ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసాయి. నాగార్జున అయితే అమెపై పరువు నష్టం దావా కూడా వేయగా..కోర్ట్ సమన్లు జారీ చేసింది.
మొన్నటికి మొన్న ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఆమె మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో లో ఓ యువతితో సురేఖ మట్లాడుతూ… ఈ రోజు మా అందరికీ పండుగ ఉంది. బిర్యానీలు తెప్పిస్తా ఉన్నము.. చిన్న పాప పేరుతోటి. మా టీమ్ టీమంతా కూడా ఇవాళ ఫుల్ ఎంజాయ్. బిర్యానీ ఉంటే బీర్ ఉంటది కదమ్మా పాపము. అఫీషియల్ సెలేబ్రేషన్ అంటే అఫీషియల్‌గా ఇచ్చేది. ఇగ అన్‌అఫీషియల్‌గా అంటే.. అన్నారు. మరో వీడియోలో ఎవరు ఎక్కువ డ్యాన్స్ చేస్తే వాళ్లకు మందు ఎక్కువ అని చెప్తున్నా అన్నారు. మూడో వీడియోలో బిర్యానీలు నడుస్తున్నయి.. అట్లనే సల్లవడుడు కూడా నడుస్తున్నది అని మంత్రి మాట్లాడారు. ఈ వీడియోలపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. సురేఖ ఇంటిలో పోలీసులు సోదాలు చేయాలని, పార్టీకి పర్మిషన్ ఉందా? మందు పార్టీనా? డ్రగ్స్ పార్టీనా? రేవ్ పార్టీనా? తేల్చాలని పోస్టులు పెట్టడం జరిగింది.
ఇదిలా ఉంటె ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది. గత కొద్దీ రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్స్ లలో , గురుకుల ఆశ్రమాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆదిలాబాద్ జిల్లా కు చెందిన శైలజ అనే స్టూడెంట్ సైతం మరణించడం జరిగింది. ఇలా వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుండడంతో బిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలకు దిగడమే కాదు..గురుకుల బాట పేరుతో కార్యక్రమం కూడా చేపట్టబోతుంది.
ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలపై(Food Poisoning Incidents) మంత్రి కొండా సురేఖ ఈరోజు మీడియా తో మాట్లాడింది. సంక్షేమ హాస్టళ్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదని , హాస్టళ్లలోని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక హాస్టల్లో ఓ విద్యార్థిని చనిపోయిందన్నారు. బాధిత విద్యార్థినికి ప్రత్యేక వైద్య సదుపాయం అందించామన్నారు. దురదృష్టవశాత్తూ చనిపోయిందన్నారు. ఆమె మృతిపై రాజకీయం చేయవద్దని కోరారు.
బీఆర్ఎస్ హయాంలో హాస్టళ్లలో భోజనంలో పురుగులు వచ్చేవన్నారు. సంక్షేమ హాస్టళ్లలో సదుపాయాలు కొరవడినా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. విద్యార్థిని మృతిని రాజకీయం చేయవద్దని కోరారు. గురుకులాల్లో కుట్రల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) హస్తం ఉందని ఆమె ఆరోపించారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పని చేశారని గుర్తు చేశారు. తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో గురుకులాల కుట్రల వెనుక ఆయన హస్తం ఉందని కీలక ఆరోపణలు మంత్రి చేసారు. మరి ఈ ఆరోపణలపై ప్రవీణ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉంది..@revanth_anumula @Bhatti_Mallu#AdminPost #kondasurekha #ministeroftelangana #endowmentminister #Telangana #brsfailedtelangana #kcrfailedtelangana #Telanganagovernment #congressgovernment #TelanganaDevelopment… pic.twitter.com/U9QtjSV34B
— Konda Surekha (@iamkondasurekha) November 29, 2024
Read Also : District Tour : జనవరి నుండి జిల్లాల పర్యటన.. జగన్ కీలక ప్రకటన