HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Komatireddy Venkatareddy Strong Warning To Private Colleges

Minister Strong Warning: ప్రైవేట్‌ కాలేజీల‌కు మంత్రి కోమటిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌..!

ప్రైవేట్‌ కాలేజీల్లో యాజమాన్యాల నిర్వాహణ నిర్లక్ష్యం, పిల్లలపై ర్యాంకుల కోసం చేసే అనవసరమైన ఒత్తిడి కారణంగా ఇంటర్ విద్యార్ధులు చనిపోవడం బాధాకరమ‌ని ట్వీట్‌లో తెలిపారు.

  • Author : Gopi Date : 03-12-2024 - 7:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Strong Warning
Minister Strong Warning

Minister Strong Warning: ఇంటర్ కాలేజీల్లో విద్యార్ధుల మరణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ (Minister Strong Warning) అయ్యారు. పది రోజుల్లో ముగ్గురు విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవడం దారుణమ‌ని అన్నారు. ర్యాంకుల పేరిట విద్యార్ధులను మానసిక ఒత్తిడికి గురిచేసే విధానాలను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మానుకోవాలని సూచించారు. విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్న కాలేజీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చ‌రించారు. విద్యార్ధులు అధైర్యపడి క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకొని తల్లితండ్రులకు గర్భశోకం మిగిల్చవద్దని మంత్రి స్టూడెంట్స్‌ని ఉద్దేశించారు తెలిపారు. ఇంటర్ విద్యార్ధులకు ఏదైనా అత్యవసర సమస్య ఉంటే ఆఫీసు మొబైల్ నెంబర్ ను 8688007954 లేదా minister.randbc@gmail.com ఈమెయిల్ కు తెలియజేయండని ఆయ‌న మొబైల్ నంబ‌ర్‌, మెయిల్ ఇచ్చారు. చావు సమస్యకు అంతిమ పరిష్కారం కాదు.. బ్రతికి సాధించాలని విద్యార్ధులకు మంత్రి పిలుపునిచ్చారు.

ప్రైవేట్‌ కాలేజీల్లో యాజమాన్యాల నిర్వాహణ నిర్లక్ష్యం, పిల్లలపై ర్యాంకుల కోసం చేసే అనవసరమైన ఒత్తిడి కారణంగా ఇంటర్ విద్యార్ధులు చనిపోవడం బాధాకరమ‌ని ట్వీట్‌లో తెలిపారు. మొన్న నారాయణ కాలేజీకి చెందిన బానోత్ తనూష్ నాయక్, నిన్న శ్రీచైతన్య జూనియర్ కాలేజీ విద్యార్ధి కౌషిక్ రాఘవ, ఈరోజు ప్రగతినగర్ లోని ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కాలేజీ విద్యార్ధిని ప్రగ్నారెడ్డి మృతి బాధాకరమ‌న్నారు.

Also Read: BR Naidu : భక్తుల దగ్గరికి వెళ్లి సమస్యలడిగి తెలుసుకున్న TTD ఛైర్మన్ బిఆర్ నాయుడు

బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలు అర్ధాంతరంగా చనిపోవడం మనసును కలిచివేస్తుందని, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్ధుల పట్ల మానవతా ధృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. వారి మానసిక స్థాయికి తగ్గట్టుగా బోధించి వారిని ప్రతిభావంతులను చేయాలి తప్పితే.. బలవంతంగా సిలబస్ ను రుద్ది వారి జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చ‌రించారు. ఇలాంటి తప్పుడు విధానాలు అనుసరించే కాలేజీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందనే విషయం కళాశాలల యాజమాన్యాలు గుర్తించి వ్యవహరించాలన్నారు. కార్పోరేట్ కాలేజీల్లో చదివే విద్యార్ధులకు ఏదైనా ఇబ్బంది ఉంటే.. మా కార్యాలయం దృష్టికి తీసుకురండి.. మేం మీకు అండగా ఉంటాం. మీ ఇబ్బందులను పరిష్కరిస్తాం. మీ కోసం ఉజ్వలమైన భవిష్యత్తు ఎదురుచూస్తుందని తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Inter Colleges
  • KomatiReddy Venkat Reddy
  • Minister Strong Warning
  • Minister Warning To Colleges
  • telangana
  • telugu news

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd