HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Metro Rail Services Stopped In Hyderabad

Metro: హైదరాబాద్ లో మెట్రో సర్వీసులు బంద్!

సికింద్రాబాద్ లో చోటుచేసుకున్న విధ్వంసకాండ ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా కనిపిస్తోంది.

  • Author : Hashtag U Date : 17-06-2022 - 3:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Metro1
Metro1

సికింద్రాబాద్ లో చోటుచేసుకున్న విధ్వంసకాండ ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే 200 రైళ్లను రద్దు చేశారు. దీంతోపాటు పరిస్థితులు అదుపులోకి వచ్చేంతవరకు ఇబ్బంది లేకుండా ఉండేలా.. ఎక్కడికక్కడ రైళ్లను ఆపేశారు. కొన్నింటిని దారి మళ్లించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రైల్వేస్టేషన్లలో భద్రతను పెంచారు. అదనపు బలగాలను మోహరించారు. హైదరాబాద్ లోని మెట్రో రైలు సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు.

అగ్నిపథ్ వద్దంటూ ఆందోళనకారులు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరసనకు దిగారు. అవి కాస్తా హింసకు దారితీయడంతో మెట్రో రైళ్లను ఆపేశారు. మెట్రోలో ప్రయాణించడానికి ఎవరూ మెట్రో స్టేషన్లకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లోని అన్ని మార్గాల్లోనూ మెట్రో సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. రేపటి (18-06-2022) నుంచి సర్వీసులు ఉంటాయని అధికారులు తెలిపారు. కానీ మెట్రోలో మియాపూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులను ఎర్రగడ్డ స్టేషన్ వద్ద అధికారులు దింపేయడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్జంట్ పనుల మీద వెళుతున్న తమను అకస్మాత్తుగా ఆపేస్తే.. ఎలా అని ఆందోళన చెందారు. కొద్దిసేపు ఆ స్టేషన్ లో గందరగోళ పరిస్థితి నెలకొంది. అటు ఢిల్లీలోనూ మెట్రో సర్వీసులను ఆపేశారు. హైదరాబాద్ లోని సబ్ అర్బన్ సర్వీసులు కూడా రద్దయ్యాయి. ఎంఎంటీఎస్ రైళ్ల సేవలను అధికారులు క్యాన్సిల్ చేశారు. అటు నాంప్లలి రైల్వేస్టేషన్ ను మూసేశారు. తిరుపతితోపాటు మరిన్ని రైల్వే స్టేషన్లలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Metro Rail
  • metro station
  • trains cancelled

Related News

Death

Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

హైద‌రాబాద్‌లో మైన‌ర్ బాలిక ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతుంది. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌ పాల్పడే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసిన‌ట్లు స‌మాచారం. కుటుంబ సభ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఒక యువకుడి నుంచి ఆమె వేధింపులకు గురవుతోంద‌ని..కొంతకాలంగా భావోద్వేగ, మానసిక క్షోభకు గురవుతోందని వారు తెలిపారు. ఘటన జరిగిన తర్వా

    Latest News

    • Health Care Tips: వర్షాకాలంలో రోగాలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి!

    • Depression: డిప్రెషన్ తగ్గించు కోవడానికి ఏం చేయాలి? మనమే తగ్గించుకోవచ్చు.

    • Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

    • LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!

    • Arjun Tendulkar: కొడుకు అర్జున్‌ ప్రదర్శనపై సచిన్‌ ప్రశంసల జల్లు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd