Subhash Pratiji : ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ ఇకలేరు..!!
ధ్యానగురువు ది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ ప్రతీజీ ఆదివారం సాయంత్రం కడ్తాల్ లోని మహేశ్వర మహాపిరిమిడ్ లో తుదిశ్వాస విడిచారు.
- By hashtagu Published Date - 03:30 AM, Mon - 25 July 22

ధ్యానగురువు ది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ ప్రతీజీ ఆదివారం సాయంత్రం కడ్తాల్ లోని మహేశ్వర మహాపిరిమిడ్ లో తుదిశ్వాస విడిచారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా వేలాది పిరిమిడ్ కేంద్రాలను ఏర్పాటు చేసారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆధ్యాత్మికత వైపు నడిపించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ లోని శక్కర్ నగర్ లో 1947లో రమణారావు, సావిత్రీదేవి దంపతులకు జన్మించారు ప్రతీజీ. విద్యాభ్యాసం బోధన్, సికింద్రాబాద్ లో కొనసాగింది. ఇంటర్, డిగ్రీ, హైదరాబాద్ లో పూర్తి చేశారు. 1990లో కర్నూల్ లో ధ్యానం కోసం బుద్ధజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. క్రమంగా 50వేలకు పైగా పిరమిడ్ కేంద్రాలను నిర్మించారు ఆయన. 1974లో ఆయనకు వివాహం కాగా ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.