Mandava Venkateswara Rao : నిజామాబాద్ లో బీఆర్ఎస్‌కు భారీ షాక్..కాంగ్రెస్ లోకి మాజీమంత్రి
మండవ వెంకటేశ్వరరావు బీఆర్‌ఎస్‌లో నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశించారు. కానీ అనూహ్యంగా ఆ స్థానాన్ని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి కేసీఆర్ బాస్ ఖరారు చేశారు
- By Sudheer Published Date - 10:55 AM, Sat - 25 November 23

ఎన్నికల పోలింగ్ (TS Polls) సమయం పట్టుమని ఆరు రోజులు కూడా లేవు..అయినప్పటికీ ఇంకా వలసల పర్వం ఆగడం లేదు. ముఖ్యంగా అధికార బిఆర్ఎస్ (BRS) పార్టీ కి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. అభ్యర్థుల ప్రకటన నుండి వరుసగా కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరుతూనే ఉన్నారు. ఇప్పటికే ఎంతోమంది చేరగా..తాజాగా నిజామాబాద్ లో భారీ షాక్ తగిలింది.
We’re now on WhatsApp. Click to Join.
నిజామాబాద్ కీలక నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు (Mandava Venkateswara Rao) పార్టీకి రాజీనామా (Resign) చేసి , నేడు బోధన్ పట్టణంలో కాంగ్రెస్ (Congress) నిర్వహించబోయే బహిరంగ సభలో హస్తం గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది. మండవకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు సమాచారం. మండవ వెంకటేశ్వరరావు బీఆర్‌ఎస్‌లో నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశించారు. కానీ అనూహ్యంగా ఆ స్థానాన్ని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి కేసీఆర్ బాస్ ఖరారు చేశారు. దీంతో గత కొంత కాలంగా మౌనంగా ఉన్న మండవ.. ఈరోజు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. ఎన్నికల వేళ పార్టీలో కీలక నేత చేరుతుండటంతో హస్తం శ్రేణుల్లో జోష్ నెలకొంది.
ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ తెలంగాణాలో అడుగుపెట్టబోతున్నారు. మూడు బహిరంగ సభలలో నేడు రాహుల్ పాల్గొంటారు. నాందేడ్ నుంచి చాపర్‌లో బోదన్ రానున్న ఆయన.. మధ్యాహ్నం 12:10 గంటలకు బోధన్‌లో పబ్లిక్ మీటింగ్‌లో ప్రసంగించనున్నారు. 2 గంటలకు ఆదిలాబాద్ బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు వేములవాడలో బహిరంగ సభలో రాహుల్ మాట్లాడనున్నారు. వేములవాడ నుండి ఛాపర్‌లో బేగంపేటకు రాహుల్ గాంధీ రానున్నారు.
Read Also : Road Accident : నల్గొండ జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా