Road Accident : నల్గొండ జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అనేవి నిత్యం అనేకం జరుగుతుంటాయి
- By Sudheer Published Date - 10:26 AM, Sat - 25 November 23

నల్గొండ (Nalgonda) జిల్లాలో ఘోర ప్రైవేట్ బస్సు ప్రమాదం (Private Bus Accident) చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు చింతపల్లి (Chinthapalli) శివారులో బోల్తా పడింది. ఈ ఘటన లో ఒకరు మృతి చెందగా..పది మందికి పైగా గాయాలపాలయ్యారు. గుంటూరు జిల్లా వినుకొండలోని పెళ్లికి హాజరైన ఓ బృందం.. హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో చింతపల్లి సాయిబాబా గుడి సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా..పదిమందికిపైగా గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు అంబులెన్సు కు ఫోన్ చేయడం తో ఘటన స్థలానికి చేరుకొని స్థానిక హాస్పటల్స్ కు తరలించారు. పోలీసులు సైతం చేరుకొని ఘటన ఎలా జరిగిందనేదానిపై దర్యాప్తు చేపట్టారు.
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అనేవి నిత్యం అనేకం జరుగుతుంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ – విజయవాడ రూట్లలో ఎక్కువ. అతివేగం , మద్యం మత్తు , నిద్ర మత్తు లో డ్రైవింగ్ చేస్తుండడం వల్ల ఈ రూట్లలో ప్రమాదాలు ఎక్కువ సంఖ్యలో జరుగుతుంటాయి.
Read Also : IT Raids : హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ రైడ్స్.. ఈసారి టార్గెట్ ఎవరంటే ?