Manchu Manoj Apologies: జర్నలిస్టులకు మంచు మనోజ్ మద్దతు.. తండ్రి తరుపున క్షమాపణలు
మోహన్ బాబు జల్‌పల్లిలోని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆస్తి కోసం గొడవపడటంలేదని మనోజ్ మరోసారి స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన మనోజ్ కాస్త ఎమోషనల్ అయ్యారు.
- Author : Gopichand
Date : 11-12-2024 - 11:33 IST
Published By : Hashtagu Telugu Desk
Manchu Manoj Apologies: హీరో మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. కుటుంబంలో జరుగుతున్న వివాదం నేపథ్యంలో నిన్న మోహన్ బాబు ఓ జర్నలిస్ట్‌పై దాడి చేశారు. దీనిపై స్పందించిన మనోజ్.. తన తండ్రి తరపున జర్నలిస్టులకు క్షమాపణలు (Manchu Manoj Apologies) చెప్పారు. ‘ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు. నా కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం బాధాకరం. నా భార్య, కూతురి పేరు లాగుతున్నారు. నా బంధువులపై దాడి చేశారు. సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తా’ అని మనోజ్ అన్నారు.
మరోవైపు మోహన్ బాబు జల్‌పల్లిలోని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆస్తి కోసం గొడవపడటంలేదని మనోజ్ మరోసారి స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన మనోజ్ కాస్త ఎమోషనల్ అయ్యారు. జర్నలిస్టులపై నటుడు మోహన్ బాబు చేసిన దాడికి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో మీడియాపై తన తండ్రి చేసిన దాడిని మంచు మనోజ్ ఖండించారు. బాధితులకు క్షమాపణ చెప్పారు. మీడియా ప్రతినిధులకు తన మద్దతును తెలిపారు. బాధిత మీడియా సోదరుల కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Also Read: Rohit Sharma: మూడో టెస్టులో రోహిత్ శర్మ ఏ స్థానంలో ఆడనున్నాడు?
ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం సదుమణిగినట్లుగానే ఉంది. అయితే మంచు మోహన్ బాబు, విష్ణు వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. ఇంత వివాదం జరిగిన తర్వాత మనోజ్ ఆ ఇంట్లోనే ఉంటారా? లేకపోతే వేరే ఇంటికి వెళ్లిపోతారా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ వివాదంలోకి భూమా ఫ్యామిలీ ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనోజ్, మౌనికకు అన్యాయం జరుగుతున్న భూమా వర్గాల్లో అభిప్రాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. వివాదం సెటిల్ కాకపోతే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అసలు గొడవ ఏంటీ? ఎక్కడ మొదలైంది అనేది మాత్రం క్లారిటీ రావటంలేదు.
మోహన్ బాబు యూనివర్శిటీలో అవకతవకలు జరుగుతున్నాయని అది అడిగినందుకు తనపై దాడి చేశారని మనోజ్ ఆరోపిస్తున్నాడు. మరోవైపు మనోజ్ తన భార్య మౌనిక మాటలు విని తాగుడుకు బానిస అయ్యాడని మోహన్ బాబు విమర్శిస్తున్నారు. ఇది ఫ్యామిలీ విషయమని, తామే సెటిల్ చేసుకుంటామని విష్ణు అంటున్నారు.