Sucide : బోనాలకు రాలేదని భర్త మనస్తాపం…భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూనే ఆత్మహత్య…!!
తన చుట్టాల ఇంట్లో బోనాల పండుగకు వెళ్దామని పిలిస్తే...రాలేదని భార్యపై అలిగాడు. ఆమెతో వీడియో కాల్లో మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకున్నాడు.
- By hashtagu Published Date - 11:57 AM, Mon - 15 August 22

తన చుట్టాల ఇంట్లో బోనాల పండుగకు వెళ్దామని పిలిస్తే…రాలేదని భార్యపై అలిగాడు. ఆమెతో వీడియో కాల్లో మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….తుక్కుగూడుకు చెందిన సాయికార్తీక్ గౌడ్( 33) భార్య రవళితో కలిసి ఈనెల 12న ఆమె చుట్టాల ఇంట్లో జరిగే వివాహం కోసం కందుకూరు మండటంలోని బేగంపేట వెళ్లాడు. తర్వాత భార్యను అక్కడే వదిలి శనివారం ఇంటికి చేరుకున్నాడు. మీర్ పేటలో నిన్న బోనాలు జరగ్గా…అక్కడ బోనాలు పండగ చేసుకుంటున్న తన పిన్ని ఇంటికి వెళ్దామని రావాలని భార్యకు ఫోన్ చేశాడు.
ఎన్నిసార్లు ఫోన్ చేసినా రవళి పట్టించుకోలేకపోవడంతో మనస్తాపం చెందిన కార్తీక్ భార్యకు వీడియో కాల్ చేశాడు. మీతరపు వారి అన్ని ఫంక్షన్లను నేను వస్తున్నా…మా వాళ్ల ఫంక్షన్లకు నువ్ ఎందుకు రావడం లేదని నిలదీస్తునే దూలానికి ఉరివేసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన రవళి పక్కింటి వాళ్లకు ఫోన్ చేసిన తన భర్తను రక్షించాలంటూ వేడుకుంేట ఇంటికి వెళ్లింది. ఆమె ఇంటికి చేరుకునే లోపే కార్తీక్ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కార్తీక్ మ్రుతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.