Mamnoor Airport : నిజాం వర్సెస్ భారత సైన్యం.. మామునూరు ఎయిర్‌పోర్ట్ చారిత్రక విశేషాలు
నిజాం జమానాలో మామునూరు(Mamnoor Airport)లో రెండు ఎయిర్‌పోర్టు రన్ వేలు, విమానాలు నిలిపే హ్యాంగర్‌లు, సిబ్బంది క్వార్టర్స్, ఇతర వసతులు నిర్మించారు.
- By Pasha Published Date - 12:20 PM, Sat - 15 March 25

Mamnoor Airport : తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మితం కానుంది. వరంగల్ నగర శివార్లలోని మామునూరు ప్రాంతంలో నూతన విమానాశ్రయం నిర్మాణానికి రంగం సిద్ధమైంది. మామునూరు ఎయిర్ పోర్టుకు ఇప్పటికే 696 ఎకరాల భూమి ఉంది. అదనంగా 280 ఎకరాల భూమిని సేకరించి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర సర్కారు కోరింది. రెండున్నర ఏళ్లలో ఇక్కడ టెర్మినల్, రన్ వేల నిర్మాణం పూర్తిచేయనున్నారు. వాస్తవానికి నిజాం కాలంలోనే మామునూరులో ఎయిర్ పోర్టును నిర్మించారు. ఆ తర్వాత అది క్లోజ్ అయింది. దీని చారిత్రక విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Copy Vs Inspire : పాటల కాపీయింగ్ వర్సెస్ ఇన్‌స్పైర్ కావడం.. దేవిశ్రీ ప్రసాద్ సంచలన కామెంట్స్
మామునూరు ఎయిర్‌పోర్ట్ చారిత్రక విశేషాలు
- నిజాం పాలనా కాలంలో 1930లో వరంగల్ శివార్లలో మామునూరు ఎయిర్ పోర్ట్‌ను నిర్మించారు.
- అప్పట్లో చాలా సంవత్సరాల పాటు ఈ విమానాశ్రయం నుంచి విమానాలు రాకపోకలు సాగించాయి.
- 1980 సంవత్సరం నాటికి ఈ ఎయిర్‌పోర్ట్ మూతపడింది.
- నిజాం జమానాలో మామునూరు(Mamnoor Airport)లో రెండు ఎయిర్‌పోర్టు రన్ వేలు, విమానాలు నిలిపే హ్యాంగర్‌లు, సిబ్బంది క్వార్టర్స్, ఇతర వసతులు నిర్మించారు.
- మామునూరు విమానాశ్రయాన్ని భారతదేశ సైనిక అవసరాల కోసం పలుమార్లు వినియోగించారు.
- ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న టైంలో మామునూరు ఎయిర్‌పోర్ట్‌లో విమానంలో ల్యాండ్ అయ్యారు.
- గతంలో కార్యకలాపాలు సాగించిన వాటిని బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు అంటారు. మామునూరు ఎయిర్ పోర్టు ఈ కేటగిరీలోకే వస్తుంది.
- చైనాతో యుద్ధం జరిగిన సమయంలో భారత్ తన విమానాలను మామునూరులోని హ్యాంగర్లలో దాచి పెట్టింది.
Also Read :Trump Vs 41 Countries : 41 దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్.. భారత్ పొరుగు దేశాలపైనా..!!
- భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. చివరి నిజాం రాజు తన రాజ్యాన్ని భారత్, పాకిస్తాన్ రెండింటిలోనూ కలపకుండా తటస్థంగా ఉండిపోయారు. ఈక్రమంలో ఏడాది కాలం పాటు యధాతథ స్థితిని కొనసాగించాలంటూ భారత యూనియన్‌తో నిజాం రాజు ఒప్పందం చేసుకున్నారు.
- ఈ ఏడాది టైంలో నిజాం రాజు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఆశ్రయించారు. హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని కోరారు.
- నిజాం రాజ్యానికి సముద్ర మార్గం లేదు. దీంతో ఆకాశమార్గంలో ఆయుధాలను తెచ్చేందుకు బ్రిటీష్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసిన సిడ్నీ కాటన్ అనే మాజీ సైనికాధికారితో నిజాం రాజు ఒప్పందం చేసుకున్నారు.
- సిడ్నీ కాటన్ ద్వారా ఆయుధాల రవాణాకు బీదర్, మామునూరు ఎయిర్ పోర్టులను నిజాం రాజు ఉపయోగిస్తున్నారని భారత వాయుసేన గుర్తించింది. దీంతో ఆపరేషన్ పోలో సమయంలో ఆ రెండు విమానాశ్రయాలపై భారత వాయుసేన బాంబుదాడులు చేసింది. ఆ టైంలోనే మామునూరు ఎయిర్‌పోర్టు రన్‌వేలు దెబ్బతిన్నాయి.
- ఆపరేషన్ పోలో కొనసాగుతున్న సమయంలో పాకిస్తాన్, పోర్చుగల్ దేశాలు నిజాం రాజుకు వాయు, నౌకా దళ సహాయం అందించాయి. ఆ సమయానికి పోర్చుగల్ స్వాధీనంలోనే గోవా ఉంది.