HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Copying Songs Devi Sri Prasads Sensational Comments

Copy Vs Inspire : పాటల కాపీయింగ్ వర్సెస్ ఇన్‌స్పైర్‌ కావడం.. దేవిశ్రీ ప్రసాద్‌ సంచలన కామెంట్స్

‘‘నేను ఇతరుల పాటలను అస్సలు కాపీ(Copy Vs Inspire) కొట్టను. ఇతరుల పాటలకు రీమేక్స్‌ కూడా చేయను.

  • Author : Pasha Date : 15-03-2025 - 11:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Devi Sri Prasad Songs Copying Songs Remake Music Director Tollywood

Copy Vs Inspire : పాటల ట్యూన్ కాపీయింగ్‌పై ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పాటల ట్యూన్‌ను కాపీ చేయడం, వాటిని విని ఇన్‌స్పైర్‌ కావడం అనేవి రెండు వేర్వేరు విషయాలని ఆయన చెప్పారు. ఒక పాటను విని స్ఫూర్తి పొందడం ద్వారా, అలాంటిదే మరో పాటను తయారు చేయొచ్చన్నారు. అది కాపీ కొట్టడం కిందికి రాదన్నారు. తన పాటలను చాలామంది కాపీ కొట్టి,  మిమ్మల్ని చూసి ఇన్‌స్పైర్‌ అయ్యామని కూల్‌గా చెప్పేశారని దేవిశ్రీ ప్రసాద్‌ పేర్కొన్నారు.

Also Read :Trump Vs 41 Countries : 41 దేశాలపై ట్రంప్ ట్రావెల్‌ బ్యాన్‌.. భారత్ పొరుగు దేశాలపైనా..!!

రీమేక్స్ అస్సలు చేయను

‘‘నేను ఇతరుల పాటలను అస్సలు కాపీ(Copy Vs Inspire) కొట్టను. ఇతరుల పాటలకు రీమేక్స్‌ కూడా చేయను. ఇప్పటివరకు నేను ఏ సినిమాకు కూడా రీమేక్ సాంగ్స్ చేయలేదు. గద్దలకొండ గణేష్‌ మూవీలో  ఒక పాట రీమేక్‌ చేయమని నన్ను అడిగారు. దీంతో ఆ సినిమానే వదిలేశాను’’ అని ఆయన తెలిపారు. సినిమా డైరెక్టర్ కథ చెబుతుంటే తాను ఆడియన్స్‌లా వింటానన్నారు. ‘‘సుకుమార్‌కు లిరిక్స్‌‌పై పట్టు ఉంటుంది. అందుకే ‘పుష్ప2’లో జాతర పాటను 10 నిమిషాల్లోనే చేయగలిగాం. సూసేకీ పాట విని సుకుమార్‌, చంద్రబోస్‌ ఇద్దరూ డాన్స్‌ చేశారు’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.

Also Read :YS Viveka : సాక్షుల మరణాలపై అనుమానం ఉంది.. వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు

100 రోజుల్లో 3 విభిన్న జోనర్లు

చివరిగా అక్కినేని నాగచైతన్య ‘తండేల్’, అల్లు అర్జున్ ‘పుష్ఫ2 : ది రూల్’, తమిళ స్టార్ సూర్య ‘కంగువా’ సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశారు. 100 రోజుల గ్యాప్‌లోనే మూడు విభిన్న జోనర్లలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. గతంలో ఒకే ఏడాది వ్యవధిలో 8 సినిమాలకు ఆయన  వర్క్ చేసి హిట్లు అందుకున్నారు. తదుపరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘కుబేరా’, ‘వృషభ’ వంటి సినిమాల కోసం దేవిశ్రీ ప్రసాద్ వర్క్ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Copy Vs Inspire
  • devi sri prasad
  • music director
  • Songs Copying
  • Songs Remake
  • tollywood

Related News

‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

Maa Inti Bangaram Overseas Collection: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్స్‌

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన తాజా చిత్రం ‘ మా ఇంటి బంగారం ’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్, మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రముఖ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం ప

    Latest News

    • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

    • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

    • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

    • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

    • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd