Lover Attack On Girlfriend : బ్రేకప్ చెప్పిందని ప్రియురాలి ఫై ప్రియుడు దాడి
స్కూల్ నుంచే వీళ్లిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతూ వచ్చింది. అయితే బీటెక్ చేస్తున్న సమయంలో ప్రియురాలు తన ప్రియుడికి లవ్ బ్రేకప్ చెప్పింది. దీంతో ప్రియుడు ఆమెపై పగ పెంచుకున్నాడు
- Author : Sudheer
Date : 06-11-2023 - 2:11 IST
Published By : Hashtagu Telugu Desk
ఇటీవల కాలంలో ‘ప్రేమ (LOVE)’ దీనికి అర్ధమే మారిపోయింది. ప్రేమ పేరుతో కొంతమంది కోర్కెలు తీర్చుకోవడం..ఆ తర్వాత విడిపోవడం చేస్తున్నారు. నిజమైన ప్రేమ అనేది కనుమరుగైపోయింది. ప్రేమ పేరుతో దాడులు పెరిగిపోతున్నాయి. ప్రేమిస్తున్నాని వెంటపడడం..కాదంటే చంపడం..ఒకవేళ ఓకే చెప్పిన తర్వాత కొన్ని రోజులకే విడిపోవడం చేస్తున్నారు. ఇప్పటికే ప్రేమ పేరుతో అనేక దాడులు జరుగగా..తాజాగా బ్రేకప్ చెప్పిందని ప్రియురాలి ఫై ప్రియుడు కత్తి తో దాడి చేసిన ఘటన హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో చోటుచేసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
కుషాయిగూడ(Kushaiguda)లోని డీఏఈ కాలనీకి చెందిన ఇద్దరు ప్రేమికులు.. చిన్ననాటి నుండే మిత్రులు. స్కూల్ నుంచే వీళ్లిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతూ వచ్చింది. అయితే బీటెక్ చేస్తున్న సమయంలో ప్రియురాలు తన ప్రియుడికి లవ్ బ్రేకప్ చెప్పింది. దీంతో ప్రియుడు ఆమెపై పగ పెంచుకున్నాడు. చివరిసారిగా మాట్లాడుదామని తన ప్రియురాలని పిలిచాడు. మౌలాలిలో ఓ కాలనీలో కారులో కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే బ్రేకప్ ఎందుకు చెప్పావని సదరు యువకుడు ఆమెతో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఆమెపై అతడు కత్తితో దాడి చేశాడు. అమ్మాయి కేకలు వేయడంతో అక్కడి స్థానికులు వచ్చి కారు అద్దాలు పగలగొట్టారు. అప్పటికి సదరు యువకుడు ఆమె ఫై కత్తి తో దాడి చేసి , ఆ తర్వాత తన గొంతు కోసుకున్నాడు. దీంతో ఇద్దర్ని హాస్పటల్ కు తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also : Mizoram, Chhattisgarh Voting : రేపే ఛత్తీస్‌గఢ్, మిజోరంలో పోలింగ్..సర్వం సిద్ధం చేసిన అధికారులు