Mizoram, Chhattisgarh Voting : రేపే ఛత్తీస్‌గఢ్, మిజోరంలో పోలింగ్..సర్వం సిద్ధం చేసిన అధికారులు
రేపు (మంగళవారం ) ఛత్తీస్‌గఢ్, మిజోరం లలో ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. ఛత్తీస్‌గఢ్‌లో ఇది తొలి దశ మాత్రమే. ఇందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసారు అధికారులు
- By Sudheer Published Date - 01:59 PM, Mon - 6 November 23

ఐదు రాష్ట్రాలకు సంబదించిన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందని మాట్లాడుకున్నామో..లేదో అప్పుడే అందులో రెండు చోట్లకు సంబదించిన పోలింగ్ సైతం మొదలుకాబోతుంది. రేపు (మంగళవారం ) ఛత్తీస్‌గఢ్, మిజోరం (Mizoram, Chhattisgarh Voting ) లలో ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. ఛత్తీస్‌గఢ్‌లో ఇది తొలి దశ మాత్రమే. ఇందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసారు అధికారులు. ఇక ప్రచారానికి నిన్నటితో బ్రేక్ పడింది.
We’re now on WhatsApp. Click to Join.
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh ) అసెంబ్లీలో 90 స్థానాలు ఉండగా.. తొలి దశలో 20 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మిజోరం అసెంబ్లీలో 40 స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మిగతా 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. మిజోరం లో 40 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడు ప్రధానపార్టీల మధ్య ఆ రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొంది. మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM), బీజేపీ, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చూస్తున్నాయి.
మిజోరం (Mizoram)లో 8,52,088 మంది ఓటర్లు ఉన్నారు, ఇందులో 4,13,064 మంది పురుషులు, 4,39,028 మంది మహిళలు ఉన్నారు. 1,276 పోలింగ్ స్టేషన్లలో తమ ఓటు వేయనున్నారు. 18- నుంచి 19 ఏళ్లలోపు 50,611 మంది ఓటర్లు మొదటిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు, 80 ఏళ్లు పైబడిన 8,490 మంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు. రాష్ట్రంలోని 30 పోలింగ్ కేంద్రాలను కీలక పోలింగ్ కేంద్రాలుగా ఈసీ గుర్తించింది. దాదాపు 5000 మంది పోలింగ్ సిబ్బంది పోలింగ్ స్టేషన్లలో నిమగ్నమై ఉన్నారు. CAPF రాష్ట్రంలో మోహరించింది.
Read Also : Telangana BJP Manifesto 2023 : బిఆర్ఎస్ ‘దళిత బంధు’ కు పోటీగా బిజెపి ‘దళిత్ రత్నా’ ..?