Crop Loan Waiver: సెప్టెంబర్ రెండో వారంలోగా రైతు రుణమాఫీ పూర్తి
ఎన్నికల హామీలో భాగంగా దశలవారీగా రైతు రుణమాఫీ చేస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 2014లో మొదటి విడత రుణమాఫీని అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
- Author : Praveen Aluthuru
Date : 30-08-2023 - 3:55 IST
Published By : Hashtagu Telugu Desk
Crop Loan Waiver: ఎన్నికల హామీలో భాగంగా దశలవారీగా రైతు రుణమాఫీ చేస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 2014లో మొదటి విడత రుణమాఫీని అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ రూ.కోటి వరకు పంట రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ ఏడాది డిసెంబర్ 11 నాటికి రూ.లక్ష పంట రుణాల మాఫీ చేయాలని నిర్ణయించారు. దాని కోసం ఆర్థిక శాఖ, వ్యవసాయ అధికారులు బ్యాంకుల ద్వారా వివరాలు సేకరించినా.. ఆ తర్వాత డీమోనిటైజేషన్, కరోనా తదితర సమస్యల కారణంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి నిధుల కొరత ఏర్పడింది.
అయితే గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోంది. రైతులు తీసుకున్న రుణాన్ని డిసెంబర్ 11, 2018లోగా మాఫీ చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం దశలవారీగా చెల్లింపులు జరుగుతున్నాయి. ఆర్థిక మంత్రి హరీష్ రావు , స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు మిగిలిన సొమ్ము చెల్లింపులను కూడా పూర్తి చేసి రుణమాఫీ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
విడతల వారీగా చెల్లింపులు చేసి సెప్టెంబర్ రెండో వారంలోగా రైతు రుణమాఫీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా ఆర్థిక శాఖ చెల్లింపులు చేస్తోంది. ఇప్పటి వరకు రూ.లక్ష లోపు రుణాలు ఉన్న వారందరి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. రూ .99 వేల 999 వరకు అప్పులు ఉన్న వారందరికీ ఈ నెల 14న ప్రభుత్వం ఏకమొత్తంగా చెల్లించింది . దాంతో దాదాపు రూ. 16 లక్షల 66 వేల 899 మంది రైతులకు 7 వేల 753 కోట్ల రుణమాఫీ చెల్లింపులు పూర్తయ్యాయి.
Also Read: Prabhas Kalki: ప్రభాస్ కల్కిలో రాజమౌళి. ఇది నిజమేనా..