HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ss Rajamouli To Play Cameo In Prabhas Kalki

Prabhas Kalki: ప్రభాస్ కల్కిలో రాజమౌళి. ఇది నిజమేనా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలకు సైన్ చేస్తున్నాడు. తాను ఒకే చెప్పినవన్నీ పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం. మధ్యలో మారుతీ డైరెక్షన్ లో ఓ హర్రర్ చిత్రంలో నటిస్తున్నాడు

  • Author : Praveen Aluthuru Date : 30-08-2023 - 2:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prabhas Kalki
New Web Story Copy 2023 08 30t144959.774

Prabhas Kalki: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలకు సైన్ చేస్తున్నాడు. తాను ఒకే చెప్పినవన్నీ పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం. మధ్యలో మారుతీ డైరెక్షన్ లో ఓ హర్రర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆద్యంతం కామెడీతో సాగుతుందని మేకర్స్ మొదటినుంచి చెప్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్, మహానటి మేకర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో కల్కి సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కరి చేస్తుంది, నిజానికి ప్రభాస్ కి ఇంత స్టార్ డమ్ రావడానికి ఎస్ఎస్ రాజమౌళి కారణం. జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా ఎల్లలు దాటింది.ఆ సినిమా తర్వాత ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు సైతం క్యూ కట్టారు
.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి చిత్రంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, దీపికా పడుకునే, అమితాబ్ బచ్చన్ ఇలా భారీ కాస్టింగ్ తో సినిమా తెరకెక్కుతుంది. ఇదిలా ఉండగాఈ సినిమాలోని ఓ సన్నివేశంలో దర్శకధీరుడు రాజమౌళి గెస్ట్ రోల్ చేస్తున్నారని ఫిలిం నగర్ వర్గాలు చెప్తున్నాయి. పాత్ర నచ్చడంతో రాజమౌళి ఏ మాత్రం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడట. అయితే.. ఇది నిజమా కాదా అనేది చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ కల్కి సినిమాలో రాజమౌళి నటిస్తే సినిమాకు మరింత ప్లస్ అయ్యే అవకాశముంది. ప్రస్తుతం హీరోలకు ఉన్న క్రేజ్ జక్కన్నకు ఉంది. ఆయన ఏ సినిమా తీసిన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. పైగా ఇటీవల ఆయన తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ లో భాగమైంది. దీంతో జక్కన్న పేరు ప్రపంచవ్యాప్తమైంది.

కల్కి సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ చేశారు. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తారని సమాచారం. మరి.. ఈ సినిమాతో ప్రభాస్ చరిత్ర సృష్టిస్తాడేమో చూడాలి.

Also Read: Bangladesh: బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cameo
  • cinema updates
  • Kalki
  • nag ashwin
  • prabhas
  • project k
  • ss rajamouli

Related News

    Latest News

    • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

    • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

    • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd