HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Lets Take Assembly Results As A Lesson And Show Strength In Parliament Harish Rao

Harish Rao: అసెంబ్లీ ఫలితాలు గుణపాఠంగా నేర్చుకుని, పార్లమెంటులో సత్తా చాటుదాం : హ‌రీశ్ రావు

  • By Balu J Published Date - 04:24 PM, Wed - 17 January 24
  • daily-hunt
Harish Rao
Harish Rao

Harish Rao: తెలంగాణ భవన్ లో ప్రారంభమైన బీఆర్‌ఎస్‌ పార్టీ నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్ లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనాచారి, ఎంపీ పి. రాములు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. “నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమీక్ష కు పెద్ద ఎత్తున హాజరైన మీ అందరికీ పేరు పేరునా అభినందనలు. ఎన్నికల ఫలితాల తర్వాత నెల రోజులకే సమీక్ష, సన్నాహక సమావేశాలు ప్రారంభించాం. ఇది పదకొండో మీటింగ్.. ఇప్పటి దాకా జరిగిన అన్ని సమావేశాల్లో ఊహించిన దాని కన్నా ఎక్కువగా విలువైన సూచనలు వచ్చాయి . కార్యకర్తలు ఏది కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో అదే జరుగుతుంది. పార్టీ మీ అభిప్రాయం మేరకే పని చేస్తుంది. తెలంగాణ అభివృద్ధి కోసం రేయింబవళ్లు తండ్లాడినం.. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో తడబడ్డాం . మన పార్టీ స్థానం మారింది.. పాలన నుంచి ప్రతి పక్షానికి వచ్చాం.. అయినా అధైర్య పడాల్సిన అవసరం లేదు. మనం ఉద్యమ వీరులం కార్య శూరులం.. ఉద్యమానికి ఊపిరి లూదిన వాళ్ళం..పేగులు తేగే దాకా మన మాతృ భూమి కోసం కొట్లాడిన వాళ్ళం.. మనకు సత్తువ ఉంది.. సత్తా ఉంది ప్రతిపక్షంలో కూడా మన మట్టి మనుషుల ఆకాంక్షల కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాడుదాం” అని హ‌రీశ్ రావు అన్నారు.

“ప్రజాస్వామ్యం లో ప్రభుత్వాలు మారడానికి బలమైన కారణాలు ఉండనక్కర్లేదు . ఈ సోషల్ మీడియా దుష్ప్రచారాల కాలంలో ప్రభుత్వం మారడానికి ప్రజలకు పనికొచ్చే అంశాలు కూడా ఉండనక్కర్లేదు. రాజస్థాన్ లో ఐదేళ్లకే ప్రభుత్వం మారింది.. ఛత్తీస్ ఘడ్ లో కూడా ఐదేళ్లకే మారింది..ఇట్లా ప్రభుత్వాలు మారడం దేశంలో కొత్తేమి కాదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో వరసగా పదేళ్లు పాలించిన సందర్భాలు చాలా అరుదు. ఐదేళ్ల లోపే ప్రజావ్యతిరేకతను మూట గట్టుకుని ఇంటికి పోయిన కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ దేశంలో ఎక్కువ. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి మూడున్నర లక్షల కోట్ల రూపాయలు కావాలి… మన బడ్జెట్ ఎంత? 2 లక్షల 90 వేల కోట్లు.. బడ్జెట్ కన్నా మించి హామీలిచ్చారు.. ఎలాగూ అధికారం రాదు కదా అని అరచేతిలో వైకుంఠం చూపేలా మేనిఫెస్టోను రాసేశారు.” అని హ‌రీశ్ రావు అన్నారు.

“కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారం లోకి వచ్చింది.. ఎన్నికలపుడు ఇష్టమొచ్చిన విధంగా ప్రజలను మభ్యపెట్టి ఇపుడు వాటి గురించి మనం అడిగితే కాకమ్మ కథలు చెబుతున్నారు. హామీల సంగతి చూడమంటే అవసరం లేని విషయాలు తెరపైకి తెస్తున్నారు.. కర్ణాటక లో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. సాంప్రదాయ రాజకీయపద్ధతులకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ గుణపాఠం గా నేర్చుకుని ముందుకు సాగుదాం.. పార్లమెంటు లో సత్తా చాటుదాం. కొంత అది నష్టం చేసిందన్న భావన కార్యకర్తల్లో ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ సమస్యలకి పరిష్కారం.. విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. అని హ‌రీశ్ రావు మండిప‌డ్డారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • harish rao
  • Loksabha Elections 2024
  • telangana

Related News

Actor Rahul Ramakrishna

Actor Rahul Ramakrishna: గాంధీని అవ‌మానించిన టాలీవుడ్ న‌టుడు రాహుల్ రామకృష్ణ!

రాహుల్ రామకృష్ణపై గాంధీజీని అవమానించిన ఆరోపణల మేరకు పోలీసులు తగిన చర్యలు తీసుకొని, కేసు నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు.

  • Revanth Reddy Vs Pk

    Prashant Kishore : మోదీ, రాహుల్ గాంధీ ఎవరూ కూడా తన నుంచి రేవంత్ రెడ్డిని కాపాడలేరన్నారు.!

  • Dasara Celebrations

    Dasara Celebrations : అంబరాన్నంటిన దసరా సంబరాలు

  • Ramreddy Damodar Reddy

    Ramreddy Damodar Reddy: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత.. ఆయ‌న రాజ‌కీయ జీవిత‌మిదే!

  • Dussehra

    Dussehra: రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం రేవంత్‌, కేసీఆర్‌!

Latest News

  • ‎Cough: విపరీతమైన దగ్గు సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

  • ‎Blood Sugar: భోజనం చేసిన వెంటనే ఈ విధంగా చేస్తే చాలు షుగర్ కంట్రోల్ అవ్వడం కాయం!

  • ‎Blood Pressure: బీపీ,గుండెపోటు సమస్యలు రాకూడదంటే మీ డైట్ లో కచ్చితంగా ఈ ఫుడ్స్ చేర్చుకోవాల్సిందే!

  • ‎Vastu Tips: పొరపాటున కూడా ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్కలు అస్సలు పెంచకూడదట.. ఎందుకో తెలుసా?

  • ‎Hair in Food: తినే ఆహారంలో తరచూ వెంట్రుకలు కనిపిస్తున్నాయా.. అయితే మీ జీవితంలో రాబోయే మార్పులు ఇవే!

Trending News

    • Gold Jewellery: ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవ‌చ్చు?

    • New Cheque System: చెక్ క్లియరెన్స్‌లో కీల‌క మార్పులు.. ఇకపై కొన్ని గంటల్లోనే డ‌బ్బులు!

    • KL Rahul Hundred: కేఎల్ రాహుల్ సెంచ‌రీ.. భార్య సెలబ్రేషన్ వైర‌ల్‌!

    • Social Media: ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. సోష‌ల్ మీడియాపై మంత్రుల‌తో క‌మిటీ!

    • Youngest Billionaire: భారతదేశంలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ ఇత‌నే.. సంపాద‌న ఎంతంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd